గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలి


Sun,June 23, 2019 05:10 AM

కులకచర్ల : గ్రామాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టిసారించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరుణ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యాతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు పాలనపై దృష్టిసారించాలని అన్నారు. గ్రామా ల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని గ్రామాల్లో వివిధ రకాలుగా అభివృద్ధి పనులు నిర్వహించి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు అందించాల్సిన బాధ్యత గ్రామాల్లో ప్రజాప్రతినిధులదేనని అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పథకాలను అందించాలని సూచించారు. గ్రామాల్లో పరిపాలన సక్రమంగా ఉండేలా చూడాలని వివరించారు. అధికారు లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. వచ్చే నెల నుంచి నియోజకవర్గంలో అన్ని శాఖల నుంచి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను విడుదల చేస్తుందని వాటిని గ్రామాభివృద్ధికి కేటాయించాలని సూచించారు. కులకచర్ల ఎంపీపీ అరుణ మాట్లాడుతూ గ్రామా ల్లో ప్రతి సమస్యలను పరిష్కరించాలని అధికారులను పనిచేయించుకునే బాధ్యత ప్రజాప్రతినిధులు, గ్రామస్తులదేనన్నారు. గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా మార్చేందుకు ప్రతి ఒక్కరు బాధ్య త తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు వారి సమస్యలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తారిక్‌అన్వర్, సూపరింటెండెంట్ ఇంద్రసేనా, డీఈ ఉమేశ్‌కుమార్, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర నాయకులు కోస్గి వెంకటేశ్, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...