జల సాధకుడికి జేజేలు


Sat,June 22, 2019 12:08 AM

-కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై జిల్లా ప్రజల హర్షం
-అనతికాలంలో పూర్తి చేయడంపై ప్రశంసలు
-టపాకులు పేల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు
-పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
-వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
తాండూరు, నమస్తే తెలంగాణ: తెలంగాణ జీవననాడి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అంబురాన్నంటాయి. తాండూరు మండల కేం ద్రంతో పాటు పల్లెల్లో నేతలు, అధికారులు, ప్రజలు కాళేశ్వరం ప్రారంభం సందర్భంగా పూజలు నిర్వహించారు. పటాకులు పేల్చి స్వీట్లు పంచి పెట్టారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే సీఎం కేసీఆర్ కల నెరవేరిందని సీఎం చిత్రపటానికి అభిమానులు జలం, క్షీరాభిషేకం చేశారు.జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాండూరులోని గంజ్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త నేతృత్వంలో కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభోత్సవ పూజలు వైభవంగా జరిగాయి.కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతాసంపత్‌తో పాటు గంజ్ వ్యాపారులు, నేతలు, రైతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎదురుచూసిన తెలంగాణ జీవననాడి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజక్టు సీఎం కేసీఆర్ పట్టుదలతోనే త్వరగా పూర్తయిందన్నారు. దీంతో 45 లక్షల ఎకరాల భూమికి సాగునీరుతో పాటు పారిశ్రామిక అవసరాలకు,తాగునీటికి ఈ ప్రాజె క్టు ఉపయోగపడుతుందన్నారు.

ప్రపంచ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు నిలిచిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రధాన అంశాలను తెలంగాణ సర్కార్ నెరవేర్చడం అభినందనీయమన్నారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో రైతులకు చాలా మేలు చేకూరు తుందన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతాసంపత్, నేతలు నర్సింహులు, శ్రీనివాస్ చారి, దామోదర్, వ్యాపారులు నాగారం నర్సింహులు, వీరేందర్, రాదాకృష్ణ, రాంరెడ్డి, దినేశ్, వెంకటేశం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చంద్రకాంత్, నర్సింహులు, రాజు స్థానిక నేతలు, వ్యాపారులు, రైతులు ఉన్నారు.

కాళేశ్వరం రాష్ర్టానికి వర ప్రదాయిని: ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పరిగి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ర్టానికి వర ప్రదాయిని అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలోని తమ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడు తూ కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ సమయంలో పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో కొత్త శకం ఆరంభమైందన్నారు. సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే త్వరగా ప్రాజెక్టు పూర్తి అయిందని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే రెండేండ్లలో పాలమూరు ఎత్తిపోతల ద్వారా పరిగి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు తీసుకువస్తామ న్నారు. సాధ్యమైనంత త్వరగా పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేయించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవడంతో రైతుల కండ్లల్లో ఆనందం కనిపిస్తుందని, బీడు భూములన్నీ సాగుభూములుగా మారతాయని చెప్పారు.

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేయించిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి శుక్రవారం పరిగిలోని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ ఆర్.ఆంజనేయలు, మాజీ జడ్పీటీసీ ఎస్పీ బాబ య్య, టీఆర్‌ఎస్ నాయకులు ఎ.సురేందర్‌కుమార్, ఎ.గోపాల్, బి.రవికుమార్, అనూష, ఆంజనేయులు, శేఖర్ పాల్గొన్నారు.

పాలమూరుతో జిల్లా సస్యశ్యామలం
వికారాబాద్,నమస్తే తెలంగాణ:బంగారు తెలంగాణగా మార్చేం దుకు సీఎం కేసీఆర్ కఠోర దీక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయించి జాతికి అంకితం చేశారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆలంపల్లి హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో నాయకులు కార్యకర్తలు బాణాసంచాలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతపద్మనాభస్వామి ఆలయంలో నాయకులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణను సస్యశామలం చేసేందుకు ప్రాజెక్టులను చేపట్టి కోటి ఎకరాల మాగానే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. వికారాబాద్ జిల్లా కూడా పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేసేందుకు సీఎం కృషి చేస్తు న్నారని అన్నారు.కార్యక్రమంలో వ్యవసాయాధికారులు గోపా ల్, వినోద్‌కుమార్, నాయకులు రాంచంద్రారెడ్డి, అనంత్‌రెడ్డి, రమేశ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, శంకర్, చందర్‌నాయక్, గోపాల్, ముత్తహర్‌షరీఫ్, రైతులు ఉన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...