ఉద్యమానికి దిక్సూచి జయశంకర్


Sat,June 22, 2019 12:02 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమ రూపకల్పన చేసిన సిద్ధాంత కర్త అని ఎమ్మె ల్యే ఆనంద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రొఫెసర్ జయశంకర్‌సార్ అడుగుజాడల్లో కొనసాగాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ కార్యాచరణ ను రూపొందించి ముందుండి నడిపించిన మ హోన్నతమైన వ్యక్తి అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కో సం ఎన్నో కలలు కని తెలంగాణ సాధనకు బాట లు వేసిన మహనీయుడన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా న డుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా రు. అలాంటి వ్యక్తి రాష్ట్రం సిద్ధంచిన తర్వాత లే కపోవడం చాలా బాధాకరమన్నారు. కార్యక్రమ ంలో టీఆర్‌ఎస్ నాయకులు అనంత్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, డాక్టర్ భక్తవత్సలం, రమేశ్‌కుమార్, పట్టణ అ ధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సురేశ్, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్ పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...