గ్రామాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత


Sat,June 22, 2019 12:02 AM

-తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌యార్డులకు తరలించాలి
-కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా
వికారాబాద్ రూరల్ : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని పాతూరు, అత్తెల్లి గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణపై గ్రామ సభలు నిర్వహించారు. పాతూరులో కలెక్టర్, అత్తెల్లిలో డీఆర్‌డీవో జాన్సన్ ముఖ్య అతిథులుగా హాజరైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా మాట్లాడారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కింద జిల్లాలో మండల పరిధిలోని పాతూరు, తాండూరులో ఖాంజాపూర్, కులకచర్ల గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ముఖ్యంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రత్యేక డబ్బాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులకు సహకారం ఎప్పటికప్పుడు అందిస్తామన్నారు. గ్రామం మొత్తం మరుగుదొడ్లు నిర్మితమై బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న తర్వాత ఎవరు కూడా బహిరంగంగా మలవిసర్జన చేయకూడదన్నారు. గ్రామంలో డంపింగ్ యార్డులు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ముఖ్యంగా ఎంపిక చేసిన గ్రామాలు సాలిడ్ వేస్టు మేనేజ్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయాలన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రతి రోజు డంపింగ్‌యార్డులకు తరలించాలన్నారు. పొడి చెత్తను మాత్రం వీలును బట్టి డంపింగ్‌యార్డులకు పంపించాలన్నారు. వర్ష్షకాలంలో గ్రామాలు అపరిశుభ్రంగా ఉంటే ప్రజలకు అంటు వ్యాధులు సోకి దవాఖానల పాలు కావాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎంపీడీవో సుభాషిణి, తహసీల్దార్ చిన్నప్పలనాయుడు, ఈవోపీఆర్‌డీ అమృత, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...