అంబరాన్నంటిన కాళేశ్వరం సంబురాలు


Sat,June 22, 2019 12:01 AM

-ప్రాజెక్టు ప్రారంభంపై సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు
-ఆలయాల్లో ప్రత్యేక పూజలు
జోన్ బృందం: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపడంతో నియోజకవర్గ వ్యాప్తంగా సంబురాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గ్రామాల్లోని ప్రధాన కూడలిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం, జలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పురాణ కాలంలో ఆకాశం నుంచి గంగమ్మను భువికి తీసుకువచ్చిన ఆ భగీరథుడైతే.. సాగు, తాగునీటి సమస్యను తీర్చేందుకు గాను మూడేండ్ల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరాన్ని పూర్తి చేసి జాతికి అంకితమిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఓవైపు పంటల సాగుకు పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మ రోవైపు ప్రాజెక్టులు నిర్మించడంతో వ్యవసాయం పండుగలా మారేందుకు కృషి సల్పుతుందని తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...