రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌వీ నాయకుడు మృతి


Fri,June 21, 2019 12:31 AM

పరిగి రూరల్ : ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని రాఘవపూర్ గేట్ సమీపంలోని గురువారం రాత్రి చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన అల్వాల బాలస్వామి కుమారుడు, టీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు అల్వాల పృధ్వీరాజ్ (27), కొన్ని రోజులు నుంచి జాఫర్‌పల్లి గ్రామ సమీపంలో గల మిషన్ భగీరథ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. గురువారం రాత్రి డ్యూటీ ముగించుకొని పరిగికి బైక్‌పై బయలుదేరాడు. తొండపల్లి గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి పరిగి నుంచి రాఘవపూర్ వైపునకు వస్తున్నాడు. లక్ష్మీదేవిపల్లి గేట్ వద్దకు రాగనే ఎదురెదురు గా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న పృధ్వీరాజ్‌కు తలకు తీవ్ర గాయాలు, మరో బైక్‌పై ఉన్న ఎల్లారెడ్డికి తీవ్రగాయ్యాలు అయ్యాయి. ఈ విషయం గమనించిన స్థానికులు 108 వాహనంలో పరిగి ప్రభుత్వ దవాఖానకు ఇరువురిని తరలించారు. పృధ్వీరాజ్‌ను పరీక్షించి డాక్టర్లు మార్గ మధ్యతో మృతి చెందినట్టు ధ్రువీకరించారు. తమకు ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందడం తో మృతుడు తల్లీదండ్రులు బోరున విలపించారు. పృధ్వీరాజ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డి, దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి, పరిగి మండల అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నా యకులు ఆర్.ఆంజనేయులు, భాస్కర్, సురేందర్‌తో పాటు పెద్ద ఎత్తున్న నాయకులు, కార్యకర్తలు పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలిరావడంతో దవాఖాన ఆవరణ జనంతో నిండిపోయింది. పృధ్వీరాజ్ మృతదేహాన్ని సందర్శించిన పలువురు నివాళులర్పించారు. పృధ్వీరాజ్ మృతి టీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగంలో పృధ్వీరాజ్ కొన్ని ఏండ్లుగా పని చేస్తూ చూరుగా ఉంటూ అందరిని మనన్నలు పొంది మంచి కార్యకర్తగా గుర్తుంపు పొందడాని ఎమ్మెల్యే గుర్తు చేశాడు. పృధ్వీరాజ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుడి కుటుంబ సభ్యులను అన్ని రకాలు అందుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...