నస్కల్‌లో మద్యపానం నిషేధం


Fri,June 21, 2019 12:31 AM

పరిగి రూరల్ : గ్రామంలో నేటి నుంచి మధ్యం సేవించకూడదని మండల పరిధిలోని నస్కల్ గ్రామస్తులు గురువారం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. గతం లో కొంత మంది మద్యం సేవించి తమ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఇబ్బందులను గమనించిన గ్రామస్తులు మద్యం నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సంద ర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పరిగి సీఐ మొగులయ్య, ఎస్‌ఐ చంద్రకాంత్‌లు మాట్లాడుతూ నస్కల్ గ్రామంలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని గ్రామస్తులు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. మద్యానికి భానిసలుగా మారి చాలా మంది ఆనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ఘటనలు ఉన్నాయని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామాల్లో ఎలాంటి గోడవలు లేకుండా శాంతియుతంగా అందురూ కలిసిమేలసి ఉండలాంటే మద్యపాన నిషేధం చేయాలని ఆలోచన రావడం హర్షనీయమన్నారు. మద్యపాన నిషేధం చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయన్నారు. పరిగి మండల రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ మేడిద రాజేందర్, గ్రామ సర్పంచ్ మేడిద పద్మమ్మ, ఎంపీటీసీ సంపూర్ణలు మాట్లాడుతూ గ్రామంలో మద్యం సేవించి మూడు నెలల కాలంలోనే ఐదు మంది మృతి చెందడం వల్ల నే అందరూ కలిసి మద్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో ఎవరు మద్యం విక్రయా లు చేపట్టరాదని దుకాణాలదారులకు కూడా తెలియ జేశ మని వారు తెలిపారు. అందరం కలిసి గ్రామం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. అనంతరం మధ్యం తాగడం వల్ల కుటుంబాలు ఏ విధంగా నష్టపోతారో పలువురు వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు బి. వెంకటేష్, అంజయ్య, లక్ష్మయ్య, మహిళ సంఘాల, యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...