కాలుష్య నివారణకు చర్యలు


Fri,June 21, 2019 12:31 AM

తాండూరు రూరల్ : కాలుష్య నియంత్రణకు పకడ్బందీ చర్యలు అవసరమని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటైందని, కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ, సాలీడ్, లీక్‌వీడ్ వెస్ట్ మెనేజ్‌మెంట్ కోసం కృషి చేస్తున్నాయని కలెక్టర్ మస్రత్ ఖానమ్ అయేషా తెలిపారు. గురువారం తాండూరు మండలం ఖాంజాపూర్ గ్రామం లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దినదినం కాలుష్యం పెరిగిపోతున్నందున సుప్రీం కోర్టు జాతీయ స్థాయిలో నేషనల్ ట్రిబ్యూనల్‌ను ఏర్పాటు చేసిందన్నారు. పట్టణాల్లో సాలీడ్ వెస్టు మెనేజ్‌మెంట్ ఎక్కువగా ఉండేదని, రానూరానూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ అవుతూ వస్తుందన్నారు. మానవుని జీవన విధానంలో రోజువారీగా మార్పులు వస్తున్నాయన్నారు.

దీని కారణంగా చెత్త రోజు రోజుకూ పెరుగుతుందని, దీని నివారణకు మార్గాలు అన్వేశించాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే జిల్లాలో నేషనల్ ట్రిబ్యునల్‌లో మూడు గ్రామాలను ఎంపిక చేశారని, అందులో ఖాంజాపూర్ గ్రామం కూడా ఉందన్నారు. ఖాంజాపూర్ గ్రామాన్ని ఫైలేట్ గ్రామంగా ఎంపిక చేశామన్నారు. ప్లాస్టిక్ వాడ కం లేకుండా మనిషీ మనుగడ కష్టాంగా మారిందనే స్థాయికి వచ్చిందన్నారు. వీటిని ఎలా నివారణ చేయాలనో ఈ ఫైలేట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామం లో చూయిస్తామన్నారు. పొడి, తడి చెత్త నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో గ్రామంలోని మహిళా సంఘాలు, యువకులను, విద్యావంతులకు ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ పొందిన వారు గ్రామంలో ఎలా అమలు చేయాలో వివరిస్తారన్నారు. ముందు గా గ్రామ పంచాయతీలో సర్పంచు అధ్యక్షతన ఓ ప్రణాళికను రూపొందించాలన్నారు. ఆ ప్రణాళికలో గ్రామంలో ఏయే అవసరా లు ఉన్నాయో తెలుసుకుంటామని, దానికి అనుగుణంగా నడుచుకుంటామన్నారు. ఖాంజాపూర్‌లో ఓడిఎఫ్ గ్రామంగా మారడం అభినందనీయమన్నారు. అంద రూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడం హర్షనీయమన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వెంటనే వారు కూడా కట్టుకోవాలని సూచించారు. ఎక్కడా కూడా బహిరంగ మల, మూత్ర విసర్జన చేయరాదని తెలిపారు. బహిరంగ మల, మూత్ర విసర్జన కారణంగా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రోగాల నివారణకు అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. గ్రామం లో సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేయాలని తెలిపారు. గ్రామంలో డంపింగ్‌యార్డు నిర్మాణం చేయాలని సూచించారు.

గ్రామంలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉందని సర్పంచు లలిత కలెక్టర్‌కు తెలుపగా, మిషన్ భగీరథ నీళ్లు వస్తాయన్నారు. భూగర్భజలాలు పెరుగాలంటే సోఫీట్స్ నిర్మించుకోవాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయ పొలాల్లో ఫాంఫాడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు నీటి సంరక్షణపై కూడా పెరుగాల్సిన అవసరం ఉందన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయవద్దన్నారు. విదేశాల్లో పొల్యూట్ ఫేజ్ చట్టం అమల్లో ఉందన్నారు. రోజు రోజుకూ అడవులు అంతరించి పోతున్నాయని, వీటి కారణంగా వర్షాలు లేక, సాగు, తాగునీటికి భవిష్యత్‌లో ఇబ్బందికరమైన పరిస్థితలు ఎదుర్కొనే అవకాశాలున్నాయన్నారు. భవిష్యత్ తరాలు భాగుండాలంటే ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, సంరక్షించాలని సూచించారు. ఓడీఎఫ్ అయిన గ్రామాలకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. జడ్పీటీసీ రవీందర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఖాంజాపూర్ ఓడిఎఫ్ గ్రామం కావడం అభినందనీయమన్నారు. ఎంపీపీ కోస్గి లక్ష్మ మ్మ మాట్లాడుతూ మరుగుదొడ్డి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతుదని తెలిపారు. మహిళ తలచుకుం టే ఖచ్చితంగా ఆ గ్రామాలన్ని ఓడిఎఫ్ గ్రామాలుగా రూపాంతరం చెందుతాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మప్ప, ఏపీడీ వేణుగోపాల్ గుప్త, నాయబ్‌తహసీల్దార్ సౌకత్ అలీ, సర్పంచు లలిత, పలువురు గ్రామస్తులు, అధికారులు తదితరులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...