కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలో పూజలు, ప్రార్థనలు


Fri,June 21, 2019 12:31 AM

-కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా
వికారాబాద్, నమస్తే తెలంగాణ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని కలెక్టర్ గురువారం ఒక ప్రకనటలో తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. ఈ మహా ప్రాజెక్టు ప్రారంభోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని అన్ని దేవాలయాల్లో, చర్చీలల్లో, మసీదుల్లో ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ఇట్టి కార్యక్రమాలు నిర్వహించాలని ఆలయ నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు.

అనంతగిరిలో ప్రత్యేక పూజలు
వికారాబాద్ టౌన్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శేఖర్‌గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, కలెక్టర్ ఆదేశాల మేరకు వికారాబాద్ అనంతపద్మనాభస్వామి ఆలయంలో ఉదయం 5:30గంటలకు మహాభిషేకం, 11గంటలకు నైవేద్యం, మంగళహారతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...