పట్టాదారు పాసుపుస్తకాల పనులను పూర్తి చేయాలి


Fri,June 21, 2019 12:30 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల అపరిష్కృతం గా ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తహసీల్దార్లతో భూ ప్రక్షాళన, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న మొటేషన్, విరాసత్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పీవోటీ కేసులకు సంబంధించిన ప్రతిపాధనలను త్వరగా పంపాలని తహసీల్దార్లను ఆదేశించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు ఆర్డీవోల స్థాయిలో ఉన్న పెండింగ్‌లో ఉంచుకోకుండా వెంటనే లబ్ధిదారులకు చెక్కులు అందజేయాలని సూచించారు. పేద ప్రజల ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అందువలన నిర్లక్ష్యం వహించకుండా లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ అరుణకుమారి, డీఆర్‌వో మోతీలాల్, తహసీల్దార్లు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...