ఓడీఎఫ్ చేసిన గ్రామాలకు అదనంగా నిధులు


Wed,June 19, 2019 11:36 PM

కులకచర్ల : ఓడీఎఫ్ చేసిన గ్రామ పంచాయతీలకు పారితోషకంగా అదనంగా నిధులు మంజూరవుతాయని కలెక్టర్ తెలిపారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయ సమీపంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ గ్రామమైతే పూర్తిగా ఓడీఎఫ్ అయితే ఆ గ్రామాలకి ప్రభు త్వం ద్వారా అదనపు నిధులు వస్తాయని అన్నారు. ప్రతి గ్రామాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించి మండలాన్ని ఓడీఎఫ్ చేయాలని సూచించారు. దీనికి ఎంపీడీవో తారిక్ అన్వ ర్ సమాధానమిస్తూ కులకచర్ల మండలాన్ని ఈ నెల 24న పూర్తిస్థాయిలో ఓడీఎఫ్ గా ప్రకటిస్తామని అన్నారు. ఇప్పటి వరకు మండలంలో 85శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని మిగిలిన 15శాతం రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మండలాన్ని ఓడీఎఫ్‌గా చేసేందుకు కృషిచేస్తున్న సర్పంచులను, అధికారులను అభినందించారు. ప్రతి గ్రామం పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగాలని అన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం ద్వారా అందించే ప్రోత్సాహకం అందించే విధంగా చూడాలని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం మండలాన్ని ఓడీఎఫ్ ప్రకటించాలని సూచించారు.

గ్రామాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు బాధ్య త తీసుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. డీఆర్డీవో జాన్సన్ మాట్లాడుతూ మండలంలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేందుకు చేరువలో ఉన్నారని సర్పంచులు, అధికారుల కృషివల్లే మండలంలో ఇంతగా ప్రోగ్రెస్ చూపించుకోగలిగామని అన్నారు. మండలంలో అన్ని గ్రామాలను పూర్తిస్థాయిలో మరుగుదొడ్లను నిర్మించి అన్ని గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించాలని అన్నారు. ఏడీఏ వీరప్ప మాట్లాడుతూ నకిలీ విత్తనాలు వాడకుండా నాణ్యమైన విత్తనాలు విత్తుకొని దిగుడి పొందాలని అన్నారు. అధికారుల సూచనల మేరకు వ్యవసాయాన్ని సాగుచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఎం ప్రత్యేక అధికారి వినయ్‌కుమార్, ఏవో వీరస్వామి, ఏపీఎం శోభ, ఏపీవో మల్లికార్జున్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మల్కాపూర్ గ్రామ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...