23న పరిగిలో పదసంకీర్తన సాహిత్య సదస్సు


Wed,June 19, 2019 11:35 PM

పరిగి, నమస్తే తెలంగాణ : తెలంగాణ సాహిత్య అకాడమి, సాహితీ సమితి పరిగి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఆదివారం పరిగిలోని సరస్వతీ శిశుమందిర్‌లో పదసంకీర్తన సాహిత్య సదస్సు నిర్వహించడం జరుగుతుందని సాహితీ సమితి అధ్యక్షుడు శేరి రామాంజనేయులు, కార్యదర్శి బి. నర్సయ్యలు తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఒకటవ సదస్సు ప్రారంభమవుతుందని, ఈ సందర్భంగా ప్రము ఖ సాహితీవేత్త డా.పి.భాస్కరయోగి రచించిన తెలంగాణ పద సంకీర్తనలు గ్రంథావిష్కరణ చేయడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు అఖిల భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డా. కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, గౌరవ అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ఆత్మీయ అతిథిగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, అతిథులుగా ఉమ్మెంతల పీఠాధిపతి వెంకటదాసులు, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డిలు హాజరవుతారని తెలిపారు. ఉదయం 11.30గంటల నుంచి ప్రారంభమయ్యే రెండో సదస్సుకు సాహితీ సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు సాంబశివశర్మ అధ్యక్షత వహిస్తారని, ఆత్మీయ అతిథులుగా డా. రాఘవేందర్‌రావు, నరేందర్, వక్తలుగా శ్రీమదచల గురుపీఠ రాజయోగాశ్రమ సమాఖ్య అధ్యక్షుడు దయానంద నాగుల వెంకటేశం, సంబరాజు రవిప్రకాశ్‌రావు, పి.నాగభూషణంలు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమయ్యే మూడో సదస్సుకు కూర జయదేవ్ అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథిగా సిద్ధాంతి పార్థసారథి, డా. దేవేందర్‌రెడ్డిలు, వక్తగా జి.కృష్ణగౌడ్‌లు పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం 3.30గంటలకు జరిగే ముగింపు సమావేశానికి సభాధ్యక్షుడిగా డా. పి.భాస్కరయోగి, ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూ టీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి వెంకటరెడ్డి, వక్తగా ప్రముఖ వాగ్గేయకారులు గోరటి వెంకన్నలు హాజరవుతారని వారు తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...