జూన్ చివరి వరకు మరుగుదొడ్లు పూర్తి చేయాలి


Wed,June 19, 2019 11:35 PM

దోమ : జూన్ చివరి వారం వరకు వందశాతం మరుగుదొడ్లు పూర్తి చేయాలని కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ సూచించారు. బుధవారం దోమ మండల కేంద్రం లో సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరి చేసిన గ్రామాల్లో ఇంకా మరుగుదొడ్ల నిర్మాణాలు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆమె సర్పంచ్‌లను ప్రశ్నించారు. మీ గ్రామాల్లో ప్రజలకు ఆ మాత్రం అవగాహన కల్పించకపోతే ఎలా అని చెప్పారు. ప్రభుత్వం నిధులు ఇచ్చిన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో శ్రద్ధ వహించడం లేదని ఆమె అసహనం వ్యక్తపరిచారు. సర్పంచులు శ్రద్ధ తీసుకొని 10రోజుల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. అందుకు గ్రామ స్థాయిలో మరుగదొడ్లు నిర్మించుకొని వారి జాబితాను సిద్ధం చేయాలన్నారు. జూన్ 30వ తేది వరకు మరుగుదొడ్లను పూర్తి చేయకుంటే ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రొగ్రెస్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు. మండలంలో 50శాతం మేరనే మరుగుదొడ్లు పూర్తి కావడంపై ఆమె తీవ్రంగా మందలించారు. ప్రతి గ్రామానికి సంబంధించిన సర్పంచులతో పాటు పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ తీసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏపీడీ జాన్సన్, తహసీల్దార్ హజీహున్నిసభేగం, ఇన్‌చార్జీ ఎంపీడీవో హరినాథ్‌గౌడ్, మండల విద్యాధికారి హరిశ్చందర్, మండల పరిధిలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...