పవర్ ఫుల్ సర్పంచ్


Mon,June 17, 2019 12:11 AM

-నేటి నుంచి సర్పంచ్‌లకు చెక్ పవర్
-నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్
-సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌చెక్ పవర్
-ఇటీవలే విడుదలైన 14వ ఆర్థిక నిధులు
-హర్షం వ్యక్తం చేస్తున్న పలు గ్రామాల సర్పంచ్‌లు
కొడంగల్, నమస్తే తెలంగాణ: సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టం 2018లో చెక్ పవర్‌కు సంబంధించిన సెక్షన్లను అమలు చేయనుంది. సోమవారం నుంచి ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. కాగా పంచాయతీపాలక వర్గాలు కొలువుదీరిన నాలుగు నెలలుపూర్తైనప్పటికీ అధికారులు, చెక్‌పవర్ లేకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. నిధులున్నా పవర్ లేకపోవడంతో స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు అప్పులు చేసి పనులు చేసిన్నట్లు పలువురుసర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి వేతనాలు చెల్లింపులు, వీధిధీపాలు, తాగునీటి పథకాల మరమ్మతలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. అయితే శుక్రవారం ప్రభుత్వం చెక్ పవర్ కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి గ్రామాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తామని ,సీఎం కేసీఆర్ కలలు కన్న బంగారు తెలంగాణను సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషను జారీ చేసింది.

ఈనెల 17 నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వనున్నారు. పంచాయతీ రాజ్ చట్టం 2018లో చెక్ పవర్‌కు సంబందించిన 6(10), 34,37(6), 43(10), 47(4), 70(4), 113(4), 114(2),141 సెక్షన్లునోటిపై చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఆడిట్ బాధ్యతలు సర్పంచ్, కార్యదర్శులకు అప్పగించారు. గ్రామ సభకు ఉండాల్సిన కోరం తదితర ఇతర అంశాలకు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

565 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు.....
జిల్లాలో 18 మండలాల్లో 565 గ్రామ పంచాయతీలున్నాయి. అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. నూతనంగా ఎన్నికైన పంచాయతీలకు ఫిబ్రవరి 2న పాలక వర్గాలు బాధ్యతలు తీసుకున్నారు. విధులు, బాధ్యతలపై సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చారు. అభివృద్ధి పనులతో పాటు, పారిశధ్యం, తాగునీరు, కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత సర్పంచ్‌లపై ఉం టుంది. అభివృద్ధి పనులు నిమిత్తం ప్రభుత్వా లు మంజూరు చేసే నిధులు, పన్నుల రూపేణ వచ్చే నిధులను ఖర్చు చేసి సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. గతంలో కార్యదర్శి, సర్పంచ్‌లు సంయుక్తంగా చెక్‌లపై సంతకాలు చేసి నిధులు ఉపయోగించేశారు. ప్రస్తుతం ప్రభుత్వం పంచాయతీల బలోపేతం కోసం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకువచ్చింది. అయితే చెక్ పవర్‌ను సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు ఇచ్చింది. గ్రామ పంచాయతీల్లో ఆడిటింగ్ బాధ్యతలు సర్పంచ్, కార్యదర్శులకు అప్పగించారు.

ఇన్నాళ్లు చెక్ పవర్‌లేక పంచాయతీ ఖాతలో ఉన్న నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాల చెల్లింపులు, వీధి దీపాలు, తాగునీటి పథకాల మరమ్మతులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కోడ్ తొలిగిపోవడంతో సర్పంచ్,ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్ కల్పిస్తూ జీవో జారీ చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు ఇటీవలే 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పన్నుల రూపేణ వసూలైన నిధులు కూడా పంచాయతీ ఖాతాల్లోనే ఉన్నాయి. ఇందులో భాగంగానే మంత్రి దయాకర్ రావు ప్రకటన సర్పంచ్‌లకు ఊతమిచ్చింది. సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు సంయుక్తంగా ప్రభుత్వం చెక్ పవర్ కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసి ఉత్తర్వులు ఇవ్వడంతో సర్పంచ్‌లందరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...