పెంపుడు జంతువులకూ...రక్తనిధి


Mon,June 17, 2019 12:09 AM

వికారాబాద్‌డెస్క్:1901లో మనుషుల్లో బ్లడ్ గ్రూప్‌లను శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టీనర్ కనిపెట్టారు. ఆ రంగంలో ఆయన చేసిన కృషికి 1930లో నోబెల్ బహుమతిని సైతం అందుకున్నారు. అప్పటి వరకు వివిధ ప్రమాదాలు, యుద్ధాల్లో గాయపడిన వారికి రక్తం ఎక్కించే పరిస్థితి లేక ఎందరో మృత్యువాతపడ్డారు. గ్రూప్‌లు కనిపెట్టిన తర్వాత మరణాలు తగ్గడంతో పాటు మనుషుల జీవన ప్రమాణాలు పెరిగాయి. 1942లో పశ్చిమబెంగాల్‌లో మొదటిసారిగా రెడ్ క్రాస్ సొసైటీ వారు రక్తనిధి సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. నాటి నుంచి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేయగా, నేడు అత్యవసర పరిస్థితిలో మనిషి రక్తం 365 రోజులు అందుబాటులో ఉంటున్నది. దీని వెనుక కార్ల్ ల్యాండ్‌స్టీనర్ కృషి ఎంతో ఉంది. ఇక నుంచి మనుషులకే కాదు పెంపుడు జంతువులకూ అవసరమైన చోట రక్తాన్ని అందించేలా యానిమల్ బ్లడ్ లైన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా కేవలం రెండు, మూడు జంతువుల బ్లడ్ బ్యాంక్‌లు ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నది.

ప్రత్యేక వెబ్‌సైట్ రూపకల్పన
ఏదైనా జంతువుకు ప్రమాదం జరిగినా, అనారోగ్యం వచ్చినా వాటికి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం దేశంలో రెండు, మూడు నగరాల్లోనే ఈ సౌకర్యం ఉండగా, అక్కడి నుంచి రక్తాన్ని తెచ్చి ఎక్కించే లోగానే జరుగాల్సిన నష్టం జరిగిపోతున్నది. దీంతో అప్పటి వరకు ఎంతో స్నేహంగా ఉన్న పెంపుడు జంతువులు మరణిస్తుండడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంటున్నది. అత్యవసర పరిస్థితుల్లో జంతువులకు రక్తాన్ని ఎక్కించి వాటి ప్రాణాలను రక్షించాలన్న మంచి సంకల్పంతో యనీ బడీ కెన్ సేవ్ ఏ లైఫ్ అనే నినాదంతో యానిమల్ బ్లడ్ లైన్ సంస్థ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇందుకు గాను www.animalbloodline.org వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌లో పెంపుడు జంతువుల యజమానులు తమ పేర్లతో పాటు జంతువులకు ఏమైనా పేర్లు పెడితే వాటి వివరాలు, ఇంటి నంబరు, ఫోన్ నంబరు పొందుపర్చి రిజిష్ర్టేషన్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఉన్న వారు వెబ్‌సైట్‌కు వెళ్లి తమ ప్రాంతాల్లోని డోనర్స్ వివరాలను తెలుసుకొని సాయం పొందవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించడంతో పాటు డోనర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

శివకుమార్ అండ్ టీమ్....
యానిమల్ బ్లడ్ లైన్ సంస్థ రూపకల్పన వెనుక ఎన్నో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజికవేత్తలు, జంతు ప్రేమికులు ఉన్నారు. వ్యవస్థాపకుడు సీహెచ్ శివకుమార్ వర్మతో పాటు రసీల్ అహ్లువాలియా (ఎన్‌ఎస్‌ఏ యానిమల్ సాంచురి), ఎస్‌కే షరీఫ్ (వ్యవస్థాపకుడు ఫ్రెండ్స్ టు సపోర్ట్ ఆర్గనైజేషన్), పీజే సంజీవ్ (యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్), డాక్టర్ పి. మౌనిక (ఎండీ రేడియాలజీ), సీహెచ్ మధుసూదన్ వర్మ, (ఎంఎస్ బయోటెక్నాలజీ), అరుణిమా శంకర్, ఎం. సాయికృష్ణ, ఎం. సాంబలు ఈ సంస్థలో టీమ్సభ్యులుగా ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...