ఓడీఎఫ్ గ్రామాలకు అధిక నిధులు


Mon,June 17, 2019 12:09 AM

బషీరాబాద్: వంద శాతం మరుగుదొడ్లు నిర్మించిన గ్రామాల అభివృద్ధి అధిక నిధులు కేటాయిస్తానని జడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మండల పరిధిలోని పర్వత్‌పల్లి గ్రామంలో ఆమె పర్యటించారు. గ్రామంలో వెలిసిన వీరబ్రహ్మేంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పా టు చేసిన నీటిశుద్ధి యంత్రాన్ని ఆమె ప్రారంభించి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవం కోసం ప్రతి ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని సూచించారు.ప్రతి గ్రామం ఓడీఎఫ్ గ్రామంగా మారాలని ఆకాంక్షించారు. వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేసుకున్న గ్రామాలకు నిధులను ఎక్కువగా మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడాలని పేర్కొన్నారు. నీటిని వృథా చేయొద్దని మహిళలకు సూచించారు. రోజూ వాడే నీటిని మొక్కలకు పారేవిధంగా చూడాలని కోరారు. టెక్నాలజీ లేని సమయంలో మన పెద్దలు మంచిగా ఆలోచించి నీటి ని వాడారని, ప్రస్తుతం బోరుబావులు వచ్చిన తరువాత నీటిని ఇష్టం వచ్చినట్లు తోడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హరితహారం పథకం కింద ప్రతి ఇంటికి ఐదు, ఆరు మొక్కలను తప్పక నాటాలని పేర్కొన్నారు. వర్షా లు కురువాలంటే మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. ప్రభుత్వం హరితహారం పథకం కింద ప్రతి పంచాయతీలో నర్సిరీల ద్వారా మొక్కలను పెంచుతుందన్నారు. ఆలయాల అభివృద్ధికి తనతంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, సర్పంచ్‌లు ఫీర్మా, విష్ణువర్ధన్‌రెడ్డి, బీమప్ప, ఎంపీటీసీ రాజు, రాథోడ్ రాజు, నాయకులు అజయ్‌ప్రసాద్ , సుధాకర్‌రెడ్డి, శ్రవణ్, సిద్దు, మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, పాషా, నర్సింహులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...