కౌలు ధరలకు రెక్కలు


Mon,June 17, 2019 12:09 AM

దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండంలో ఏటేటా కౌలు భూముల ధరులకు రెక్కలోస్తున్నాయి. దీంతో కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. అయితే ఏటా పత్తి ధర పెరగటంతోనే కౌలు భూముల ధరలు పెంచుతున్నారని రైతులు చెబుతున్నారు. ఐదేళ ్ల క్రితం క్వింటలు పత్తి ధర రూ. 3 వేలే ఉండేది.ప్రస్తుతం 5 వేలకు చేరింది. దీంతో కొద్ది పాటి భూమి ఉన్న రైతులు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారుకూడా ఇతరుల భూమలను కౌలుకు తీసుకోవడం మొదలు పెట్టారు. ఫలితంగా భూయాజమన్యూలు కౌలు ధరలు పెంచుతూ వస్తున్నారు.ఈ ప్రాంతంలో వర్షాధారంగా పత్తి పంటను సాగుచేస్తున్నారు.

ఎకరాకు రూ.15 వేలపై మాటే..
మండల వ్యాప్తంగా దాదాపు 12 వేలకుపైగా రైతులు ఉండగా వీరిలో దాదాపు 500 మంది వరకు కౌలురైతులున్నారు.కౌలు రైతులు పత్తి పంట సాగుపైకి దృష్టి మళ్లడంతో సొంత భూమి ఉన్న రైతులు కౌలు ధరలు పెంచుతూ పోతున్నారు.ఆయిదేండ్ల క్రితం ఎకరం భూమి కౌలు ధర రూ.5 వేలు ఉండగా ప్రస్తుతం రూ.15 వేలకు చేరుకుంది. దీంతో సన్నకారు, చిన్నకారు రైతుల్లో ఆందోళన చెందుతున్నారు. పత్తికి మర్కెట్‌లో మంచి ధర లభిస్తుండటంతో ఈ కౌలు ధర మొత్తం కూడా చెల్లించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. వర్షాలు, వడగండ్లు, వానాల వల్ల పంటలు దెబ్బతింటే మాత్రం కౌలు రైతులు నిలువునా మునిగిపోతున్నారు.

కౌలు రైతులకు బ్యాంకుల్లో అందని రుణాలు
మండలంలో వ్యవసాయ బావులు, బోర్లు ఉన్నా రైతులు సొంతగానే భూమిని సాగు చేసుకుంటున్నారు. నీటి ఆధారం లేని భూ యజమనులు వారి భూములను కౌలుకు ఇస్తున్నారు. అయితే కౌలు రైతులకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తే బాగుటుందని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...