ప్రతి రైతు ఖాతాలో రైతుబంధు


Mon,June 17, 2019 12:08 AM

కొడంగల్, నమస్తే తెలంగాణ : ప్రతి రైతు ఖాతాలో రైతు బంధు పథకం జమవుతుందని ఏవో బాలాజీ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు పంట సాగు చేపట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అందిస్తుందని, ఇందులో భాగంగా ప్రస్తుతం రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. గతంలో రైతు బంధు అందుకున్న, పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు వర్తిస్తుందని, ఒకరి ఖాతాలో జమ కాబడుతున్నాయి, మా ఖాతాలో జమ కావడం లేదనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తయారు కాబడ్డ జాబితా ప్రకారం రైతు బంధు విడుతల వారీగా రైతుల ఖాతాలో జమ అవుతాయన్నారు.
కాబట్టి రైతులు ఈ నెల చివర వరకు ఓపిక పట్టాలని తెలిపారు. రైతు బంధు పథకం ఖాతాలో జమ కాలేదని రైతులు ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ తిరుగవద్దని, రైతు బంధు కోసం దళారీలను నమ్మవద్దని సూచించారు. ఈ నెల చివరి వరకు ప్రతి రైతు ఖాతాలో రైతు బంధు పథకం క్రింద ఎకరానికి రూ.5 వేలు జమకానున్నాయని స్పష్టం చేశారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...