విజయోత్సాహం..


Sun,June 16, 2019 12:40 AM

-నూతనంగా ఎన్నికైన నేతలకు,ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం
-అభివృద్ధి, సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
-తాండూరులో కందిబోర్డు ఏర్పాటుకు కృషి
-చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి
-పెండింగ్‌ పనులు త్వరలో పూర్తి
-ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
-పార్టీకి నష్టం చేసినవారిని సస్పెండ్‌ చేస్తాం
-జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు
-జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి
తాండూరు, నమస్తే తెలంగాణ: ఇటీవల జరిగిన ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించడంతో శనివారం తాండూరు టీఆర్‌ఎస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సావ సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లాతో పాటు తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ చేసిన కారుదే హవా కొనసాగడంతో టీఆర్‌ఎస్‌ నేతలు ఉత్సాహంగా సంబురాలు చేశారు. పట్టణంలోని భవానీ ఫంక్షన్‌హాల్‌లో నూతనంగా ఎన్నికైన ఎంపీ రంజిత్‌రెడ్డిని, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డితో పాటు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, కో ఆప్షన్‌ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ముందెన్నడే లేని విధంగా ప్రవేశ పెట్టిన పథకాలతో మళ్లీ టీఆర్‌ఎస్‌ అఖండ మెజార్టీతో గెలుపొందినదని అందుకు సహకరించిన నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎల్లప్పుడు ప్రజలతోనే ఉంటు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.

తాండూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకు వచ్చి మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా కంది బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి త్వరలో తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రజల కుటుంబ సభ్యునిగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటు కుటుంబంలో ఒక వ్యక్తిగా ప్రజలకు సేవలు చేస్తానని అన్నారు. తన రాజకీయ జీవితాన్ని అంచలంచలుగా ఎదిగేందుకు సహకరించిన తాండూరును జీవితంలో మరవనన్నారు. తాండూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకు వస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులు కూడ త్వరలో పూర్తి చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీగా తమ గెలుపునకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తామన్నారు. ఇబ్బందులు ఉంటే ప్రజలు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యుర్థులు ఓడిపోవడానికి కారణమైన టీఆర్‌ఎస్‌ నేతలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామన్నారు. పార్టీలో ఉంటు పార్టీకే అన్యాయం చేసేవారిని సహించేది లేదన్నారు. ఓడిన వారు బాధ పడకుండా ధైర్యంగా ప్రజల్లోనే ఉంటు సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలు నారాయణరెడ్డి, కర్ణం పురుషోత్తం రావు, అబ్దుల్‌ రావుఫ్‌, లక్ష్మారెడ్డి, విశ్వనాథ్‌గౌడ్‌, రాజుగౌడ్‌, విజయదేవి, రంగారావు, కోట్రికె విజయలక్ష్మి, నీరజాబాల్‌రెడ్డి, పరిమళ, శోభారాణి, ఉషా, నర్సింహులు, కవి, సుమిత్‌గౌడ్‌, జావిద్‌, మసూద్‌, మహిపాల్‌రెడ్డి, సంతోశ్‌కుమార్‌, శకుంతల, అనురాధ, నర్మాదరెడ్డి, సిద్రాల శ్రీనివాస్‌, యు.రమేశ్‌కుమార్‌, నూతనంగా ఎన్నికైన తాండూరు నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

తండ్రి అడుగుజాడల్లో..
పరిగి, నమస్తే తెలంగాణ : పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించారు. మహేశ్‌రెడ్డి ‘స్పార్క్‌ లెస్‌ క్యారెక్టర్‌', తండ్రికి తగ్గ కొడుకు అని ఏకంగా సీఎం కేసీఆర్‌చే అభినందనలు పొందారు. రాజకీయంగా కాలు పెట్టిన తొలి అడుగులోనే విజయం సాధించడం ద్వారా రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగారు మహేశ్‌రెడ్డి. పరిగి నియోజకవర్గానికి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఐదు పర్యాయాలు 1985, 1994, 1999, 2004, 2009లలో ఎమ్మెల్యేగా 25 ఏండ్లు సేవలు అందించారు. అదే బాటలో కొప్పుల మహేశ్‌రెడ్డి రాజకీయ బుడిబుడి అడుగ్లులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఫిబ్రవరి 24న జిల్లా రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌గా నియమింపబడిన మహేశ్‌రెడ్డి వెనుదిరిగి చూడలేదు. తండ్రి అనారోగ్యంపాలైన తర్వాత పార్టీని నియోజకవర్గంలో ముందుండి నడిపించారు. అనతికాలంలోనే ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మహేశ్‌రెడ్డి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...