రెవెన్యూ గ్రామ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి


Sun,June 16, 2019 12:36 AM

ధారూరు : గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ గ్రామ సదస్సులను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. శనివారం ధారూరు మండల పరిధిలోని బాచారంలో రెవెన్యూ గ్రామ సభ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ నవీకరణలో భాగంగా రైతులకు ఆర్డర్‌ కాపీని రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ గ్రామ సభలు చాలా మంచి కార్యక్రమమని దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏండ్ల తరబడి ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోనివి ఈ రెవెన్యూ గ్రామ సభల ద్వారా సమస్యలు గ్రామంలోనే పరిష్కారం అవుతున్నాయన్నారు. కార్యక్రమం నిర్వహించడం ద్వారా రైతులకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. గ్రామాల్లో నిర్వహించే భూ రికార్డుల నవీకరణ కార్యక్రమం అనే పేరుతో పార్ట్‌ బి సమస్యల పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమం ద్వారా రెవెన్యూ అధికారులు తమ గ్రామంలోకి వచ్చి పార్టు బి కి సంబంధించిన సమస్యలన్ని పరిష్కారిస్తారన్నారు.

రైతులకు పంట పెట్టుబడి రైతుల తమ తమ ఖాతాలో జమా చెయడం జరుగుతుందన్నారు. రైతులకు పంట పెట్టుబడి కింద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎకరాకు రూ.10 వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, ధారూరు ఎంపీపీ ఉమాపార్వతి, ధారూరు టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కావలి అంజయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాజునాయక్‌, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు రాంరెడ్డి, కెరెళ్లి సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ధారూరు తహాసీల్దార్‌ రాధాబాయి, వీఆర్‌వోలు మోహన్‌, గిర్ధార్‌ గోపాల్‌, నర్సింహులు, భూపాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సంతోష్‌కుమార్‌, యూనుస్‌, హఫీజ్‌, శంకర్‌,అనంత్‌రెడ్డి, కృష్ణయ్య, చిగుళ్లపల్లి రమేశ్‌, విజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌, రంగరాజ్‌, సురేశ్‌, తిమ్మని శంకర్‌ పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...