జూలై 1 నుంచి ఆపరేషన్‌ ముస్కాన్‌


Sun,June 16, 2019 12:36 AM

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించబోయే ఆపరేషన్‌ ముస్కాన్‌ 5ను జిల్లాలో నిర్వహించనున్నట్లు జిల్లా అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌రావు తెలిపారు. శనివారం వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్‌ మస్కాన్‌పై చైల్డ్‌లైన్‌, ఎస్సీ,ఎస్టీ, బీసీ వెల్ఫేర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సబ్‌డివిజన్ల వారిగా ఏర్పాటు చేసిన టీంలను ఎస్సై, ఏఎస్సై స్థాయి అధికారులను ఇన్‌చార్జులుగా ఉంచి ఆపరేషన్‌ మస్కాన్‌ నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో గతంలో జరిగిన ఆపరేషన్‌ ముస్కాన్‌, ఆపరేషన్‌ స్మైల్‌ల వివరాలను తెలియజేయాలన్నారు. అదే విధంగా దర్పన్‌ అనే నూతన టెక్నాలజీ ద్వారా తప్పిపోయిన వారి వివరాలను, ట్రెస్‌ అవుట్‌ అయిన వారి వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని సూచించారు.

ఇట్టి ఆపరేషన్‌లో 14 సంవత్సరాలలోపు 18 సంవత్సరాలలోపు బాల, బాలికలు, హోటల్స్‌, మాల్స్‌, మైనింగ్‌,రైల్వే స్టేషన్‌లో వెట్టి చాకిరి చేస్తున్నవారిని, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో బిక్షాటన చేసేవారిని, చదువును మధ్యలో నిలిపివేసిన వారిని గుర్తించి సంబంధిత చైల్డ్‌హోంకు పంపించాలన్నారు. వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లల భవిష్యత్‌ను నాషనం చేసే అధికారం ఎవరికి లేదని తెలియజేయాలన్నారు. ఈ ఆపరేషన్‌ మస్కాన్‌ నందు జిల్లా నందు బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో చైల్డ్‌ లేబర్స్‌ ఉండకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైన చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గుర్తించిన పిల్లలను వివిధ సంక్షేమ హాస్టళ్లలో చేర్పించి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. డీడబ్ల్యూవో జోత్స్న, బీసీ వెల్ఫేర్‌ అధికారి పుష్పలత, బీసీపీవో రాజేశ్‌కుమార్‌, ఏఎస్‌డబ్ల్యూవో ఉమాపతి, చైల్డ్‌లైన్‌ అధికారులు శశివర్మ, ప్రసన్న, వెంకటేశం, ఎస్సైలు సంతోష్‌కుమార్‌, షరీఫ్‌ఖాన్‌, వీరన్న, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...