ప్రభుత్వ బడి ముద్దు, ప్రైవేట్‌ పాఠశాల వద్దు


Sat,June 15, 2019 12:14 AM

-ఊరూరా బడి బాట
-గ్రామాల్లో విద్యార్థులచే ర్యాలీలు
-పిల్లలందరూ బడిలో ఉండాలంటూనినాదాలు
-తల్లిదండ్రులు విధిగా పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి
-కోట్‌పల్లిలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనంద్‌, ఉపాధ్యాయులు
ధారూరు : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు వీరే శం పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కుక్కింద, ధారూరు, మైలారం, తరిగోపుల, నాగారం తదితర గ్రామా ల్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా మన ఊరు, మన బడి మొదటి రోజు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి, వాల్‌ పోస్టర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తారన్నారు. కుక్కింద ఉన్నత పాఠశాల ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల ఉందని అన్ని వసతులతో ఉపాధ్యాయులు మంచి విద్యను అంది స్తూ ప్రగతి పథంలో నడుపుతున్నారన్నారు. గ్రామంలోని పిల్లలను తల్లిదండ్రులు తమ పిల్లలను మన ఊరు మన బడిలోనే చేర్చాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు. మం డలం చరిత్రలోనే ఎప్పుడు చేయనటువంటి సైన్స్‌ఫెయిర్‌ నిర్వహించి అందులో 70 అంశాలకు సంబంధించి ప్రయోగాలు చేసి దిగ్విజయం చేసిన ఉపాధ్యాయులను మరోసారి అభినందించారు. ఎంపీటీసీ బసప్ప మాట్లాడుతూ మన పాఠశాలలో మంచి ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. మన పిల్లలందరూ మన ఊరు, మన బడిలోనే చేరి ఊరికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు రవీంధర్‌రెడ్డి, సీ ఆర్‌పీ అంజయ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తరిగోపు ల ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌కుమార్‌, విద్యా కమిటీ చైర్మన్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నతంగా ఎదుగాలి
వికారాబాద్‌ రూరల్‌ : విద్యార్థులు ఉన్నతంగా చదివి త మ లక్ష్యాలను చేరుకోవాలని సర్పంచ్‌ వెంకటేశ్వర్‌ అన్నా రు. మండల పరిధిలోని గొట్టిముక్ల జడ్పీహెచ్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు స్వప్న ఆధ్వర్యంలో బడిబాట కా ర్యక్రమం నిర్వహించి గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ సం దర్భంగా సర్పంచ్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ బాల బాలికలు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అం దజేస్తుందన్నారు. విద్యార్థులు గ్రామంలో తిరుగుతూ చి న్నారులు బడికి రావాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
గ్రామాల్లో బడిబాట ర్యాలీలు
నవాబుపేట : ప్రభుత్వ బడులే ముద్దు, ప్రైవేట్‌ బడులు వద్దని ప్రధానోపాధ్యాయుడు రాంరెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమాన్ని మండల పరిధిలోని చించల్‌పేట ఉన్నత పా ఠశాలతో పాటు ఆయా గ్రామాల్లో నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ప్ర భుత్వ బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని, అర్హులైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని అన్నారు. పిల్ల లను మొదటి తరగతి నుంచి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కాలె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పోలీస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
బంట్వారం : ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం జరుతుందని ఎంపీపీ సుజాత పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు బొపునారం, తొరుమామిడి తదితర గ్రామాల్లో ‘బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రస్తు తం ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యను అందించడం జ రుగుతుందని చెప్పారు. విద్యతో పాటు దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం లాంటివి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో డ బ్బులను పెట్టి విద్యను కొనాల్సి వస్తుందన్నారు. కార్యక్రం లో తహసీల్దార్‌ లలిత, ఎంఈవో చంద్రప్ప, ఎంపీడీవో సు శీల్‌కుమార్‌ షిండే, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యార్థుల ర్యాలీతో గ్రామాల్లో సందడి
మోమిన్‌పేట : బడిబాట కార్యక్రమంలో భాగంగా మం డలంలోని ఉన్నత, ప్రాథమి, అంగన్‌వాడీ కేంద్రాల విద్యార్థులతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఉచిత విద్య లభిస్తుందని విద్యార్థు లు, ఉపాధ్యాయులు కలిసి గ్రామాల్లోని ప్రధాన వీధులగుం డ తిరుగుతూ చదువు ప్రగతికి వెలుగు అంటూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యాతోనే బంగారు భవిష్యతుకు బాటలు
కోట్‌పల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యతుకు బాటలు వేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని మో త్కుపల్లి గ్రామంలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసేందుకు వచ్చిన ఆయన బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులచే ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 14 ఏండ్లు నిండిన ప్రతి చిన్నారి పాఠశాలల్లో చేరి చదువుకోవాలనే నిబంధన ఉందని అన్నారు. పిల్లలచేత ఎటువంటి వెట్టిచాకిరి, ఇతర పనులను చేయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని, అందుకు విద్యార్థులు నాణ్యమైన విద్య అం దుతుందన్నారు. విద్యార్థులకు చదువుకునేందుకు పాఠ్యపుస్తకా లు, దుస్తులు, పౌష్టికాహారం ప్ర భుత్వమే ఉచితంగా ఏర్పాటు చే స్తుందన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎం పీపీ ఉమాదేవి, సర్పంచ్‌ పాండురంగారెడ్డి, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, విద్యార్థులు తదిత రులు పాల్గ్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...