ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి


Sat,June 15, 2019 12:13 AM

పరిగి రూరల్‌: మండలంలోని రూఫ్‌ఖాన్‌పేట్‌, చిట్యాల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయులు నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించాలంటూ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. రూఫ్‌ఖాన్‌పేట్‌లో సర్పంచ్‌ నరసింహ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ యాదయ్య ఆధ్వర్యంలో పలువురు చిన్నారులు రూఫ్‌ఖాన్‌పేట్‌ ప్రాథమిక పాఠశాలల్లో చేరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల్‌ సర్పంచ్‌ రజిత, ఎంపీటీసీ వెంకటేశ్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్‌, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి.ఉస్మాన్‌అలీ, ఎస్‌ఎంసీ చైర్మన్లు చంద్రశేఖర్‌, వీరాచారి, వైస్‌ చైర్మన్లు రాములమ్మ, యశోద, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు బి.రాజపుల్లారెడ్డి పాల్గొన్నారు.
కులకచర్ల: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బడిబాట కార్యక్రమాన్ని కులకచర్లలో సర్పంచ్‌ సౌమ్యారెడ్డి, ఎంఈవో అబీబ్‌హైమద్‌, కులకచర్ల బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, ఉపాధ్యాయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామాల్లో బడీ డు పిల్లలందరూ బడుల్లో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. మండల పరిధిలోని పీరంపల్లిలో గ్రామ సర్పంచ్‌ రాధిక, ఉపసర్పంచ్‌ చెన్నయ్య, బోట్యనాయక్‌తండాలో సర్పంచ్‌ గంగ, ఎంపీటీసీ రాజు, గోప్యనాయక్‌తండాలో ఉపాధ్యాయులు, విద్యార్థులు బడిబాటలో పాల్గొన్నారు.

పూడూరు : మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజా ప్రతి నిధులు బడిబాట కార్యక్రమాలు నిర్వహించారు. పూడూరు మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్‌, అంగడి చిట్టంపల్లి, సోమన్‌గుర్తి, తుర్కె ఎన్కెపల్లి, మన్నెగూడ, పూడూరు, చన్గోముల్‌ ప్రభుత్వ పాఠశాలల్లో జయశంకర్‌ బడిబాట కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు శ్రీధర్‌గుప్త, బి.జయమ్మ, జ్యోతిరాజేందర్‌రెడ్డి, మదు,వినోద్‌గౌడ్‌లు మాట్లాడుతూ గ్రామంలోని బడీడు పిల్లలను పొలంపనులకు తీసుకువెళ్లకుండా పాఠశాలలకు పంపించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బడీడు పిల్లలను పనులకు తీసుకు వెళ్తే చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు నాగమణి, శ్రీదేవిక, పాఠశాల ప్రధానోపాద్యాయులు అంజిలయ్య తదితరులు ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...