432 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు


Sat,June 15, 2019 12:13 AM

-త్వరలో పెండింగ్‌ పనులకు శ్రీకారం
-నేడు తాండూరులో టీఆర్‌ఎస్‌ విజయోత్సవ ర్యాలీ
-విలేకర్ల సమావేశంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు రావుఫ్‌, యాలాల ఎంపీటీసీ పరుషోత్తంరావు
తాండూరు, నమస్తే తెలంగాణ: గడిచిన నాలుగున్నర సంవత్సరాల పాలనలో తాండూరు నియోజకవర్గంకు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ సహకారంతో 432 కోట్ల 75 లక్షల నిధులతో 34 పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని టీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో టీఆర్‌ఎస్‌ తాండూ రు పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌ రావుఫ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, యాలాల ఎంపీటీసీ కరుణం పురుషోత్తంరావు మాట్లాడుతూ..
తాండూరును సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దెముల్‌ పరిధిలోని పల్లెల్లో తెలంగాణ సర్కార్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అభివృద్ధికి శ్రీకారం చుట్టిందన్నారు. బైపస్‌ రోడ్‌, రైల్వే బిడ్జి మినహా అన్ని పనులు కొనసాగుతున్నాయన్నారు. త్వరలో మిగిలిన పనులు కూడా ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. మహేందర్‌రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలసమస్యలను తెలుసుకుంటు ప్రభుత్వం ద్వారా వచ్చే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందివ్వడంలో మెరుగైన పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కూడా మహేందర్‌రెడ్డిదే అన్నారు.

నేడు విజయోత్సవ ర్యాలీ...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడంతో శనివారం తాండూరు పట్టణంలో టీఆర్‌ఎస్‌ తాండూరు శాఖ ఆధ్వర్యంలో ఉ.11 గంటలకు శివాజీ చౌక్‌ నుంచి భవానీ ఫంక్షన్‌హాల్‌ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ నేతలు పరుషోత్తంరావు, అబ్దుల్‌ రావుఫ్‌ తెలిపారు. అనంతరం ఎంపీగా గెలుపొందిన రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీగా గెలుపొందిన మహేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సునీతారెడ్డితో పాటు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీకు పట్టణంలోని భవానీ ఫంక్షన్‌హాల్‌లో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వడ్డె శ్రీను, టీఆర్‌ఎస్‌ నేతలు మసూద్‌, మన్‌మోహన్‌సార్డా, సుమిత్‌గౌడ్‌, పూజారి పాండు, భద్రేశ్వర్‌ తదితరులున్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...