రైతుల ఆర్థికాభివృద్ధే కేసీఆర్‌ ధ్యేయం: ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి


Sat,June 15, 2019 12:12 AM

పూడూరు : రైతులు అన్నివిధాల అర్థికాభివృద్ధి చెందిన నాడే దేశాభివృద్ధి సాధ్యమని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పూడూరు మండలం చీలాపూర్‌ గ్రామంలో 121 మంది రైతుల పట్టాపాస్‌బుక్‌లను పింపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. చీలాపూర్‌ గ్రామంకు చెందిన రైతుల భూములు రెవెన్యూ రికార్డు ప్రకారం గేజిట్‌లో లేకపొవడంతో ప్రభుత్వం అందజేస్తున్న కొత్త పట్టా పాస్‌బుక్‌లు రైతులకు అందలేవన్నారు. దీంతో గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా డబ్బులు పంపిణీ చేసిన, ఈ గ్రామంలోని రైతులకు డబ్బులు అందలేవన్నారు. గత ఎన్నికలకు ముందు గ్రామస్తులు, రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వ నిబంధనల ప్రకారం గేజిట్‌లో నమోదు చేసి తమకు ప్రభుత్వ నుంచి వచ్చే రైతుబంధు పథకం వర్తించేలా చూడాలని తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.

గత ఎన్నికలకు ముందే రైతులకు పట్టా పాస్‌బుక్‌లతో పాటు రైతు బంధు పథకం డబ్బులు అందేలా చూస్తానని ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం గ్రామంలోని 161 మంది రైతులకు గాను, 121మంది రైతులకు పట్టాపాస్‌బుక్‌లు అందజేస్తున్నట్లు తెలిపారు. పట్టా పాస్‌ బుక్‌లు అందిన ప్రతి రైతుకు రైతు బంధు పథకం ద్వారా డబ్బులు అందుతాయని వివరించారు. కొత్త పాస్‌బుక్‌లు అందని మరికొందరి రైతుల సమస్యలను రెవెన్యూ అధికారులు పరిశీలించి వారికి వెంటనే కొత్త బుక్‌లు అందేలా చూడాలన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేసేలా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. చీలాపూర్‌ గ్రామ రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నేరవేర్చడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్‌లను అందజేశారు. ప్రతి విద్యార్థులను తల్లి దండ్రులు స్థానిక ప్రభుత్వ బడిలో తమ పిల్లలను చేర్పించాలని ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ, పుడుగుర్తి మల్లేశం, సర్పంచ్‌ రాములు, ఎంపీటీసీలు సరళరెడ్డి, రామకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు అజీం, మండల రైతు సమన్వయ సంమితి కన్వీనర్‌ రాజేందర్‌రెడ్డి,నాయకులు సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్‌ వహీద ఖాతున్‌, డీప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...