భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ గ్రామ సభలు


Thu,June 13, 2019 11:59 PM


పరిగి రూరల్ : భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తున్నామని, ఈ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా పేర్కొన్నారు. మండలంలోని ఖుదావంద్‌పూర్‌లో గురువారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభకు హాజరైన కలెక్టర్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాసు పుస్తకాలు రానివారు ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే రైతులకు కొత్త పాసు పుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. కొంత మంది రైతులు ఆధార్ లింక్ చేసుకోకపోవడం వల్లే రైతుబంధు రావడం లేదని, ఆధార్ లింక్ చేసుకున్న అందరికీ రైతుబంధు వస్తుందని ఆమె తెలియజేశారు. వేలిముద్రలు రాని వారు ఐరీష్ ద్వారా అనుసంధాన చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈకేవైసీ చేసుకొని రైతులు వెంటనే మీ సేవ కేంద్రానికి వెళ్లి ఆధార్ అనుసంధానం చేయించుకోవాలన్నారు. మొదడి విడుతలో పరిష్కరం కాని భూ సమస్యలు రెండో విడుతలో పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామదన్నారు. ఎవరు పేరు మీద భూమి ఉందో వారే గ్రామ సభలకు వచ్చి తమ సమస్యను అధికారులకు విన్నవించి సమస్య పరిష్కరించుకోవాలని ఆమె రైతులకు సూచించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న రెండొ విడుత రైతు సమగ్ర సర్వేను పకడ్బందీంగా నిర్వహిస్తుమన్నారు. అనంతరం రైతుల నుంచి ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామని ఆమె హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్‌డీవో విశ్వనాథం, పరిగి తహసీల్దార్ అనురాధ, ఆర్‌ఐ కిరణ్, వీఆర్‌వోలు లింగంగౌడ్, జగన్‌మోహన్‌రెడ్డి, వెంకటగిరి, సర్పంచ్ గోపాల్, ఎంపీటీసీ ఉమాదేవి, రేషన్ డీలర్ బొంపల్లి రాజు ఉన్నారు.

ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకం
దోమ: ప్రతి రైతుకు కొత్త పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేసి రైతుబంధు పథకం అమలు పరుస్తామని కలెక్టర్ మస్రత్‌ఖానం ఆయేషా పేర్కొన్నారు. గురువారం దోమ మండలం మల్లెపల్లిలో రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రెవెన్యూ సిబ్బందిని గ్రామాలకు పంపి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు మార్గం సులభం చేస్తామన్నారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూములకు సంబంధించిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదని ఫిర్యాదు చేశారు. సమస్యలను పరిష్కరించి ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథం, తహసీల్దార్ హాజీహున్నిసబేగం, సర్పంచ్ అంజిలయ్య రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...