అసైన్డ్ భూముల రైతులకు న్యాయం చేయండి


Thu,June 13, 2019 11:58 PM

పెద్దేముల్ : మండల పరిధిలోని కొండాపూర్ అసైన్డ్ పట్టా భూముల రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గురువారం జిల్లా అటవీశాఖ అధికారి, పెద్దేముల్ మండల తహసీల్దార్‌లను ఆదేశించారు. పెద్దేముల్ మండలం కొండాపూర్‌కు చెందిన సుమారు 30 మంది రైతులు గురువారం ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డిని హైదరబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వారి గోడు వినిపించారు. మండల పరిధిలోని కొండాపూర్‌లో సర్వేనెంబర్ 4లో సుమారు 50 ఎకరాల అసైన్డ్ పట్టా భూమి ఉంది. అయితే సుమారు 70 ఏండ్ల నుంచి ఆ గ్రామ రైతులు అసైన్డ్‌పట్టా కలిగి ఉండి ఈ భూముల్లో కాస్తులో ఉండి సాగు చేసుకొంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆరునెలల క్రితం అటవీ శాఖ అధికారులు ట్రెంచ్ తవ్వారు. రైతులు పాత పట్టా పాసుపుస్తకాలు చూయిస్తే వెళ్లిపోయారు. కాగా నిన్న మళ్లీ అటవీశాఖ అధికారులు చెట్లు నాటడానికి అని సర్వే నెంబర్‌లో 4లో గుంతలను తవ్వుతుంటే కొండాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇట్టి విషయాన్ని గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుపోగా అందుకు వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కొండాపూర్ గ్రామస్తులకు అండగా నిలుస్తూ వెంటనే జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవ్ రావు, మండల తహసీల్దార్ తులసీరాంలకు ఫోన్‌లో మాట్లాడి సర్వే నెంబర్ 4లో ఎవరికైతే అసైన్డ్ పట్టా పాత, కొత్త పాసు పుస్తకాలు ఉన్నాయో వారి జోలికి వెళ్లకూడదని, అసలే పొలాల్లో విత్తనాలు వేసే సమయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని, వీలైనంత త్వరగా అటవీ శాఖ, రెవెన్యూ శాఖ వారు సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించి ఎవరి హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయో త్వరగా తేల్చి కొండాపూర్ రైతులకు న్యాయం చేయాలని ఇరువురు అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. దళిత, గిరిజన రైతులు కుటుంబాలు ఆ గ్రామంలో కేవలం ఈ భూములపైన ఆధారపడి ఉన్నాయని, వారి జోలికి వెళ్లరాదని తెలిపారు. ఈ విషయంలో కొండాపూర్ రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి గురువారం అన్నారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో కొండాపూర్ సర్పంచ్ రాంచంద్రయ్య, టీఆర్‌ఎస్ నాయకుడు పి.రవీందర్, గ్రామ రైతులు హరిజన్ ఏసు, నగేశ్, శాంతిబాయి పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...