కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిక


Thu,June 13, 2019 11:58 PM

కోట్‌పల్లి: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లకు ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరు తున్నారని ఓగ్లాపూర్ సర్పంచ్ శోభరాణిరాములు అన్నారు. గురు వారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ నివాసంలో కాంగ్రెస్ నాయకులు ఇటీవల ఇండిపెండెంట్‌గా ఎంపీటీసీగా పోటీ చేసిన గున్నె అంభిక, గున్నె శివసంఘమేశ్వర్‌లకు టీఆర్‌ఎస్ కండువాను కప్పి ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలను అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.టీ ఆర్‌ఎస్ అమలు చేసిన పథకాలను చూసి, కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారని అన్నారు. తెలంగాణ లో టిఆర్‌ఎస్‌దే హవా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఇందోల్ సర్పంచ్ రాంచెందర్, గుడిసె పాండయ్య తదితరులు ఉన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...