అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్షరాభ్యాసం


Thu,June 13, 2019 11:58 PM

కులకచర్ల: కులకచర్ల మండల పరిధిలోని రాంనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రాజు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్ మల్లమ్మ, పంచాయతీ కార్యదర్శి శారదలు హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని గ్రామ సర్పంచ్ రాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ సంఘం ప్రతినిధులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పూడూరు మండలంలో..
పూడూరు: గ్రామంలోని ప్రతి చిన్నారిని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఎంపీటీసీ శ్రీదేవిక, సర్పంచ్ సంధ్యారెడ్డి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అంజిలయ్య తెలిపారు. గురువారం అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లలకు అక్షరాభ్యాసం అనంతరం గ్రామంలో విద్యపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమం జి.పద్మ,ఉప సర్పంచ్ మల్లేష్, భాస్కర్‌రెడ్డి, జి.లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...