బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించండి


Thu,June 13, 2019 11:58 PM

వికారాబాద్ రూరల్ : దేశంలో ఎక్కడ కూడా బాలకార్మికులు ఉండకుండా నిర్మూలన చేయాలని బాల కార్మికుల జాతీయ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రంజిత్‌ప్రకాశ్ అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టర్ చాంబర్‌లో అంతర్జాయతీ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినం సందర్భంగా కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాలకార్మికుల నిర్మూలన కోసం ప్రభుత్వం ట్రేడ్ యూనియన్లు, ఎంజీవో సహకారంతో పూర్తిగా నిర్మూలించేందుకు ఐఎల్‌వో కృషి చేస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ ఆదాయాన్ని మెరుగు పర్చుకున్నైట్లెతే పిల్లలను బాలకార్మికులుగా మార్చే అవకాశం ఉండదన్నారు. పిల్లలు పని చేస్తున్న సంస్థలను గుర్తించి వారిని పని చేయకుండా నివారించేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా బాలకార్మికులు వ్యవసాయ రంగంలో 70 శాతం ఉన్నారన్నారు. బాలకార్మికులను సంరక్షించి వారి కుటుంబాలకు ఆర్థికంగా ప్రయోజనాలు కల్పిస్తే బాల కార్మికులుగా మారేందుకు అవకాశం ఉండదన్నారు. వివిధ పరిశ్రమల్లో కూలీలుగా పని చేసే వారికి పిల్లలే మళ్లీ బాల కార్మికులుగా తయారు అవుతున్నారన్నారు. కలెక్టర్ సహకారంతో అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. జూన్ 12న బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, అదిలాబాద్, వరంగల్, గజ్వేల్, జోగుళాంబ జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. బాలకార్మికుల కోసం 138, 182 చట్టాలు పని చేస్తున్నాయన్నారు. బాలకార్మికులను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా మాట్లాడుతూ జిల్లా లో ఎక్కువగా తాండూరు పట్టణంలోని బండల తయారీ కేంద్రాల్లో, పరిగి మండలంలోని ఇసుక తవ్వకాల పనులు జరిగే ప్రదేశాల్లో ఎక్కువగా బాలకార్మికులు ఉన్నట్లు గుర్తించామన్నారు. అనంతరం బాలకార్మికుల నిర్మూలన పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, డీవైఎస్‌వో హన్మంత్‌రావు, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య, వివిధ కార్మిక సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...