పార్టీ కోసం పనిచేసినవారికి సముచిత స్థానం


Thu,June 13, 2019 11:57 PM

చేవెళ్ల: కష్టపడి బాగా పని చేసేవారిని పార్టీ అధిష్ఠానం అప్పకుండా గుర్తించి వారికి సముచితస్థానం కల్పిస్తుందని వికారాబాద్ జడ్పీచైర్ పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి,ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి,మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డిలు తెలిపారు.గురువారం చేవెళ్ల మండల పరిధిలోని ఎన్కెపల్లి ఎంపీటీసీ వనం మాధవి లక్ష్మికాంత్ రెడ్డి,ఎంపీటీసీ పరిధిలోని సర్పంచ్‌లతో కలిసి వికారాబాద్ జడ్పీచైర్ పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి,ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి,మహేశ్వరం ఎమ్మె ల్యే సబితారెడ్డిలను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశా రు.ఈ సందర్భంగా ఎంపీటీసీ వనం మాధవిలక్ష్మీకాంత్‌రెడ్డిని వారు అభినందించారు.అనంతరం వారు మాట్లాడుతూ.....పార్టీ బలోపీతం కోసం పని చేసేవారిని అధిష్ఠానం సముచి స్థానం కల్పిస్తుందన్నారు. రాష్ట్రం లో ఎదురులేని పార్టీగా టీఆర్‌ఎస్ అవిర్భవించిందని తెలిపారు.అందుకు అనుగుణంగా నూతనంగా ఎన్ని కై ప్రజాప్రతినిదులు ప్రజలకు అందుబాటులో ఉం టు గ్రామీణ ప్రజల సమస్యలను తెలుసుకోని ఎప్పటికి అప్పుడు పరిష్కరించాలని అన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సమష్టి కృషితో గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు రాముచంద్రయ్య,రాజు,బ్యాగరి లక్ష్మ య్య, మాజీ సర్పంచ్‌లు వనం మహేందర్ రెడ్డి,క మ్మెట హన్‌మంత్‌రెడ్డి,మాజీ ఎంపీటీసీ జంగయ్య, ఎంపీటీసీ పరిధిలోని నాలుగు గ్రామాల నాయకులు,గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...