మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాలి


Thu,June 13, 2019 12:13 AM

- దేశంలో అన్ని ప్రాంతాల్లో పూర్తయ్యాయి
- తప్పించుకుందామని చూస్తే సహించేది లేదు
-మండలంలో మరుగుదొడ్డి లేని ఇండ్లు ఉండొద్దు
-కచ్చితంగా 100 శాతం నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే
- కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా
బషీరాబాద్ : గత ఐదేండ్ల నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కొనసాగుతుంటే నేటికి మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకపోవడంపై అధికారుల పనితీరు ఏ విధ ంగా ఉందో అర్థం చేసుకోవచ్చని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని శ్రీ కృష్ణ మందిర్ ఫంక్షన్ హాల్ వ్యక్తిగత మరుగుదొడ్లు, హరితహారం కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఒక్కో గ్రామ సర్పంచ్‌ను పిలిచి మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణానికి తమ వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి, ఈ నెలాఖారు లోపు గ్రామం మొత్తంలో మరుగుదొడ్లను ఎ లా పూర్తి చేస్తారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కేవలం ప్రోత్సహం ఇచ్చేందుకే రూ. 12 వేలు చె ల్లిస్తుంది, ఈ విషయం గుర్తు పెట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించాలి, వారిని కట్టించేలా ఓప్పించాలని కలెక్టర్ తెలిపారు. కొంత మంది సర్పంచ్‌లు, అధికారులు కాంట్రాక్టర్ పేరు చెప్పడంతో కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు.

ఈ పనులు కాంట్రాక్టర్ చేసే పనులు కావు, స్థానికంగా ఉన్నవారే చేయాలి, పదే పదే కాంట్రాక్టర్ పేరు చెప్ప డం ఏమిటి ఇదేమైన రోడ్డు, బ్రిడ్జి పనుల కాంట్రాక్టర్ నిర్మించడానికి ఇలాంటి మాటాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో సర్పంచ్‌ల పాత్ర చాలా కీలకమైంది. గ్రామంలో ఏ ఒక్క ఇ ల్లు మరుగుదొడ్డి లేకుండా ఉండకూడదన్నారు. 100 శాతం కచ్చితంగా మరుగుదొడ్లు నిర్మించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్క జిల్లాలో తప్ప అని సమావేశంలో గుర్తు చేశారు. పూర్తి స్థాయిలో మరుగుదొడ్లను ప్రారంభించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ సిబ్బందికి డెటికేషన్ లేదని అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో ఇసుక సమస్య గురించి కొంత మంది సర్పంచ్‌లు ప్రస్తావించగా వెంటనే తహసీల్దార్‌తో మాట్లాడి ఇసుక సమస్యను పరిష్కరించారు.

మరుగుదొడ్లకు తప్ప ఇతర అవసరాలకు వాడుకుంటే కఠన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. త్వరలోనే మళ్లీ మండలానికి వస్తా అప్పుడు అన్ని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మొదలైందే మరుగుదొడ్ల నిర్మాణం నుంచి కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సిబ్బందికి తప్ప కుండా మరుగుదొడ్డి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం జలాల్‌పూర్‌లో జరిగే రెవెన్యూ గ్రామసభలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అంతకు ముందు డీఆర్‌డీవో జాన్సన్ మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణాలపై సర్పంచ్‌లు, అధికారులు సమన్వయంతో పని చేస్తే లక్ష్యం పూర్తి కావడం జరుగుతుందన్నారు. ఎంపీపీ కరుణ మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణం అందరి సహకారంతోనే విజయవంతమవుతుందన్నారు. నూతన సర్పంచ్‌లు హరితహారంకు శ్రీకారం చూట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, మండల ప్రత్యేకాధికారి రవి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు నర్సింహులు, శాంతి, పద్మ, దశరథ్, ఎంపీటీసీలు నాగేంద్రయ్య, నరేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...