చేనేతను ప్రోత్సహించాలి


Thu,June 13, 2019 12:13 AM

తాండూరు, నమస్తే తెలంగాణ: ప్రజలు చేతివృత్తి, చేనేత పనులను ప్రోత్సహించాలంటే చేనేత దుస్తులను కొనుగోలు చేయాలని తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతాసంపత్, చేనేత హస్తకళ నిర్వాహకులు, గ్రామీణ వీవర్స్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు రంగస్వా మి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సావుకారుపేట్ ఆర్యవైశ్య కల్యాణ మండపంలో గ్రామీణ వీవర్స్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శన, అమ్మకాలను ప్రా రంభించారు. ఈ ప్రదర్శనలో 29 రాష్ర్టాల్లో ని అన్ని వస్తువులు, వస్ర్తాలు క్రాప్ట్ మేళాలో అమ్మకాలకు ఉంచారు. పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం చీరలతో పాటు యువతీ యువకులకు నూతన మా ర్పులతో వచ్చిన ప్రత్యేక డ్రెస్ మెటీరియల్, హ్యాండ్రిక్రాప్ట్ వస్తువులు, కొండపల్లి బొమ్మలు, బ్లాక్ మెటల్, నైట్‌మెటల్ వస్తువులు కూడా అమ్మకాలు ఉంచారు. తాండూరులో చేనేత హస్తకళమేళా ప్రదర్శన, అమ్మకాలను ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...