రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి


Thu,June 13, 2019 12:13 AM

ధారూరు: ఓ కేసు దర్యాప్తు నిమిత్తం వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదంలోఆదివారం కానిస్టేబుల్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధారూరు మండలం లక్ష్మీనగర్ తండాలకు చెందిన తులసీరామ్ 2018లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని మైలార్‌దేవరంపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ కేసు దర్యాప్తు విషయంలో నిందితున్ని పట్టుకునేందుకు బీహార్‌కు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్‌లోని డిండోర జిల్లా సుమన్‌పూర్ వద్దకు రాగానే కారు చక్రాలు ఊడిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ తులసీరాం(29)కు తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు. కారులో తీసుకొస్తున్న నిందిడుతు రమేశ్‌నాయక్ మృతి చెందాడు. ఎస్సై రవీందర్‌నాయక్, మహిళా కానిస్టేబుల్ లతకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తులసీరామ్ మృతితో ధారూరు మండలం లక్ష్మీనగర్‌తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన తులసీరామ్‌కు భార్య ఉంది. కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయనకు తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. గ్రామస్తులతో కలిసిమెలసి ఉండే తులసీరామ్ మృతి చెందడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. తులసీరామ్ మృతదేహం స్వగ్రామానికి బుధవారం రాత్రి వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...