ఖరీఫ్ సీజన్‌కు ఎరువులు, విత్తనాలు సిద్ధం


Tue,June 11, 2019 11:53 PM

- కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా
వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఫర్టిలైజర్స్ అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ శాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్10వరకు డాటా ప్రకారం రైతు బంధు పథకం అమలు చేయనున్నట్లు తెలియజేశారు. రైతు బీమా పథకం కింద జిల్లాలో 17 కేసులు వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించి రైతు కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఖరీఫ్ సీజన్‌కుగాను 7,915 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉండగా ప్రస్తుతం 3,500 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫర్టిలైజర్స్ 56,443 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా ప్రస్తుతం 13,253 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉన్నటువంటి స్టాక్ అయిపోయినకొద్ది వెంట వెంటనే తెప్పించి రైతులకు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. రైతులకు విత్తనాలు, ఫర్టిలైజర్ సరైన విధంగా పంపిణీ చేయాలని సూచించారు. రైతు బంధు పథకం కింద రైతులకు పంట సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. 1,07,318 మంది రైతులకు రైతు బంధు చెల్లింపుల కోరకు ట్రెజరీ కార్యాలయానికి బిల్లు పంపడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, ఏడీ వినోద్‌కుమార్, మండల వ్యవసాయాధికారి తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...