ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లండి : కలెక్టర్


Tue,June 11, 2019 11:53 PM

బొంరాస్‌పేట : స్వచ్ఛ భారత్ మిషన్ పథకం లక్ష్యం నెరవేరాలంటే అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంపై మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అన్ని రంగాల్లో ముందుంటున్నా మరుగుదొడ్ల నిర్మాణంలో మాత్రం వెనుకబడి ఉన్నారని, గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించి ప్రతి గ్రామం ఓడీఎఫ్‌గా మారాలన్నారు. గ్రామస్థాయిలో పదిమంది మండలస్థాయి అధికారులు సేవలు అందిస్తున్నారని ప్రజల సహకారం తీసుకుని ప్రణాళికా ప్రకారం ముందుకెళ్లాలని, అందరి సహకారం తీసుకుని వందశాతం నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. మరుగుదొడ్డి నిర్మించుకున్న వారు నిర్మించుకోలేని వారి ఇండ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. లబ్ధిదారుకు ప్రభుత్వం ఇచ్చే రూ.12 వేలు కేవలం ప్రోత్సాహం మాత్రమేనని ఆర్థిక సహాయం కాదని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ఎవరు మొండికేసినా సహించేది లేదని హెచ్చరించారు.
తుంకిమెట్లలో ఇంటింటికీ తిరిగి అవగాహన
మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో ఇంటింటికీ తిరిగి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కలెక్టర్ ఆయేషా కోరారు. గ్రామానికి చెందిన మ్యాదరి అంజిలమ్మ కూతురు యాదమ్మ పీజీ చదివిందని మరుగుదొడ్డి నిర్మించుకోవాలని చెప్పిన వెంటనే కట్టుకుందని ఫీల్డ్ అసిస్టెంట్ అంజిలయ్య చెప్పడంతో కలెక్టర్ ఆమె ఇంట్లోకి వెళ్లి కొద్దిసేపు కూర్చున్నారు. యాదమ్మను అభినందించారు. వారితో ఫోటో దిగారు.
మరుగుదొడ్డి నిర్మించుకున్న ఇండ్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. గ్రామ సర్పంచ్ స్వరూపతో కలిసి మరుగుదొడ్లు నిర్మించుకున్న కొన్ని ఇండ్లకు వెళ్లి చూశారు. మరుగుదొడ్డి లేని ఇండ్లకు వెళ్లి సర్పంచ్ బొట్టుపెట్టి నిర్మించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి పుష్పలత, వైస్ ఎంపీపీ దేశ్యానాయక్, తహసీల్దార్ వరప్రసాదరావు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...