బాల్య వివాహాలను నిర్మూలించాలి


Tue,June 11, 2019 11:52 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : బాల్య వివాహాలు నిర్మూలించి, బాలికల, మహిళల అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి రాజేశ్‌కుమార్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని రైల్వే కమ్యూనిటీ హాలులో సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యాశాఖ, గ్రామ కార్యదర్శులు, వీఆర్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్‌కుమార్ మాట్లాడుతూ బాల్యవివాహాలు బాలికల, మహిళల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పూర్తిగా కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్క రూ ఉన్నత విద్య ను అభ్యసించాలన్నారు. ఉపాధి అవకాశాలు పెంచాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఎంత పని చేసినా ఏ మాత్రం తగ్గడం లేదని తెలిపారు. దీనికి కారణం గ్రామీణ ప్రజలకు అవగాహన లేక పోవడమే అన్నారు. అందువల్ల ప్రతి గ్రామం లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పరిరక్షణ కమిటీలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో బంట్వారం ఎంఈవో చంద్రప్ప, మర్పల్లి ఎంఈవో విద్యాసాగర్, మోమిన్‌పేట ఎంఈవో శంకర్, నవాబుపేట ఎంపీవో గోపాల్, యాలాల ఎంఈవో సుధాకర్‌రెడ్డి, డీఈవో కార్యాలయ సిబ్బంది రవి,వీఆర్‌వోలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...