ఇకపై ఎకరాకు రూ.5వేలు


Tue,June 11, 2019 12:00 AM

-నగదు బదిలీ ద్వారా రైతుల ఖాతాల్లోకి..
-మే 20వరకు డేటాలో ఉన్నవారితో పాటు.. ఈనెల 10వరకు పట్టా పాసుపుస్తకాలు పొందిన రైతులకు అందజేత
-కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి
-జిల్లాలో 1,76,188 రైతుల ఖాతాలు అందజేశాం
-మిగిలిన 25,405మంది రైతులు కొత్త పట్టాదారులు
-వీరంతా ఆధార్, పాస్‌బుక్కు, బ్యాంక్ ఖాతా వివరాలు అధికారులకు అందించాలి
-కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా
వికారాబాద్, నమస్తే తెలంగాణ : రైతు బంధు పథ కం కింద మే 20వ తేదీ నుంచి అందిన డేటా ప్రకారం జూన్ వరకు ఖరీఫ్ పంట సహాయం కింద ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో పంట సహాయం గా నగదు బదిలీ చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి తెలియజేశారు. సో మవారం వ్యవసాయ శాఖ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, వ్యవసా య ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథిలు వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రైతులకు సరైన విధంగా రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడి సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మే 20 వరకు డేటాలో ఉన్న రైతులతో పాటు ఈ నెల 10 వరకు డిజిటల్ సంతకాలు కాబడి పట్టాదారు పాసుపుస్తకాలు అందిన రైతులకు కూడా రైతు బంధు సహాయం అందించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,01,593 మంది రైతులకుగాను, 1,76,188 మంది రైతులు ఖాతా వివరాలు అందించడం జరిగిందన్నారు.

మిగతా 25,405 మంది రైతులు కొత్త పట్టాదారులుగా నమోదు కాబడ్డారన్నారు. వీరంతా సంబంధిత మండల వ్యవసాయాధికారి, విస్తరణ అధికారులను సంప్రదించి పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్, బ్యాంక్ ఖాతా వి వరాలు అందించాలని వివరించారు. జిల్లాలో మండలాల వారీగా కొత్త పట్టాదారులుగా కోట్‌పల్లిలో 1437, కొడంగలో 917, కులకచర్లలో 1452, తాం డూరులో 1538, దోమలో 2013, దౌల్తాబాద్‌లో 1720, ధారూరులో 1536, నవాబుపేట1839, పెద్దేముల్ 1160, పరిగి 1587, పూడూరు 1643, బం ట్వారం 42 9, బొంరాస్‌పేట 1101, బషీరాబాద్ 285, మోమిన్‌పేట 1490, మర్పల్లి 1198, యాలాల 1386, వికారాబాద్ 2607గా నమోదైనట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో జాన్సన్, వ్యవసాయాధికారి గోపాల్ పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...