కలిసి పని చేస్తాం..


Mon,June 10, 2019 11:58 PM

-సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తాండూరు అభివృద్ధి
-నిలిచిన అభివృద్ధి కార్యక్రమాలకుమూడు రోజుల్లో శ్రీకారం
-ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని ఎంపీ, జడ్పీ, ఎమ్మెల్సీ నిధులతో తప్పక నెరవేరుస్తాం
-మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురేస్తాం
-విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
తాండూరు, నమస్తే తెలంగాణ: ప్రతిక్షణం ప్రజల సేవకోసమే తాము నిరంతరం పాటు పడుతున్నట్లు ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి స్థానిక నేతలతో కలిసి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రూ. 100 కోట్లతో తాండూరు అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలో నిలిచిన అభివృద్ధి కార్యక్రమాలకు మూడు రోజుల్లో శ్రీకారం చుడతామన్నారు. తాండూరులో రోడ్డు విస్తీర్ణతతో పాటు రైల్వే బ్రిడ్జి నిర్మాణం, ఔటర్‌రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామన్నారు. భూమి కోల్పోయిన రైతులకు ఖాతాల్లో డబ్బులు వేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు దగ్గరుండి పనులన్ని చేపిస్తానని తెలిపారు. వెనుక బడిన ప్రాంతాలకు ఎంపీ, జడ్పీ, ఎమ్మెల్సీ నిధులను కేటాయించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీల్లో టీఆర్‌ఎస్ అభ్యుర్థులే గెలువడం సీఎం కేసీఆర్ ప్రభుత్వ పారదర్శ పాలనకు నిదర్శనమన్నారు. ఉమ్మడి జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చారిత్రాత్మకమైందన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తాండూరుతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ జెండా ఏగురడం కాయమని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీలోకి ఎవరోచ్చిన కలిసి పనిచేస్తాం..
టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, ప్రవేశ పెడుతున్న ప్రత్యేక పథకాలతో అనేక మంది నేతలతో పాటు ప్రజలు, కార్యకర్తలు ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి రావడం సంతోషమన్నారు. గులాబీ దళంలోకి ఎవరు వచ్చిన పార్టీ అభివృద్ధికి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అందరం కలిసికట్టుగా ఉండి పనిచేస్తామన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తమపై గెలిచిన ఫైలెట్ రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి రావడంపై మీ అభిప్రాయమని విలేకర్లు ప్రశ్నించగా... పార్టీ అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా చేస్తామన్నారు. కాగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా నన్ను ఓడగోట్టానని ఎగిరి పడిన కొండాకు ప్రజలు ఎంపీ ఎన్నికల్లో ఓడగొట్టి బుద్ది చెప్పారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు రవిగౌడ్, నారాయణరెడ్డి, వడ్డె శ్రీనివాస్, కరుణం పురుషోత్తంరావు, అబ్దుల్‌రావుఫ్, సాయిలుగౌడ్, సురేందర్‌రెడ్డి, బోయ రాజు తదితరులున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...