రెవెన్యూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి


Mon,June 10, 2019 11:57 PM

కోట్‌పల్లి : రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకునేందు కు ఆయా గ్రామాల రైతులు సహకరించి, పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పూర్తి చేసుకోవాలని తహసీలార్ గోపాల్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని కొత్తపల్లి, ఇందోల్ గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించారు. కొత్తపల్లిలో కొత్తగా వచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలను తహసీలార్ రైతులకు అందించారు. అక్కడ పార్ట్ బీ కి సంబంధించిన రెండు కేసుల్లో ఒకటి వెంటనే పరిష్కరించా రు. మరొకరికి భూ సర్వే అనంతరం పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇందోల్‌లో పార్ట్ బీ సమస్యలను పరిష్కరించారు. రైతులకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. గ్రామానికి మంజూరైన 110 వ్యక్తిగత మరుగుదొడ్లకు గాను 70 పూర్తి అయ్యాయని, 40 ని ర్మాణ దశలో ఉన్నాయని త్వరలోనే పూర్తి చేస్తామని సర్పం చ్ రామచందర్ అన్నారు. అనంతరం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న 25 మంది లబ్ధిదారులకు రూ.6వేల చొప్పున చెక్కులను అందజేశారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...