మండలాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటిస్తాం


Mon,June 10, 2019 11:57 PM

మోమిన్‌పేట : మండల పరిధిలోని 28 గ్రామ పంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావచ్చాయని, ఇప్పటికే కొంత మంది కార్య ద ర్శులు వారివారి గ్రా మాల్లో వందశాతం పూర్తైనట్లు వివరించారని ఈ నెల 15వ తేదీ లోగా మండలాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించడం జరుగుతుందని ఎంపీడీవో శై లజారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సమావేశ మందిర ంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో చివరి దశలో ఉన్నాయని, వివిధ కారణాలతో నిర్మాణాల్లో జాప్యం జరుగుతుందన్నారు. రెం డు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కార్యదర్శులు వివరించారు. ఇంతా మండలంలో ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ లక్ష్మి, ఏపీ వో శంకరయ్య పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...