సమస్యలను సత్వరమే పరిష్కరించాలి


Mon,June 10, 2019 11:56 PM

-అధికారులు అలసత్వం వహించకుండా న్యాయం చేయాలి
-ఆర్డీవో విశ్వనాథం
వికారాబాద్, నమస్తే తెలంగాణ : ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించి అర్జీదారులకు కాలయాపన చేయకుండా తక్షణమే న్యాయం చేయాలని ఆర్డీవో విశ్వనాథం అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వివిధ సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపా రు. ఈ ఫిర్యాదుల్లో కల్యాణలక్ష్మి, షాదీ ము బారక్, భూ సమస్యలు, వికారాబాద్ మధుకాలనీ సమస్యలు తీర్చాలని, కలెక్టరేట్ కోసం కేటాయించి న భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్లు పే ర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సరైన విధం గా పరిశీలించి సమయానుకూలంగా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలు కూడా చిన్న చిన్న సమస్యలను మండల స్థా యిలోనే పరిష్కరించుకోవాలన్నారు. అధికారులు అలస త్వం వహించకుండా ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి వారికి సరైన న్యాయం చేయాలన్నారు. స మస్యలను నిర్లక్ష్యం చేస్తూ అర్జీదారులకు కాలయాపన చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యలను తీర్చడానికే అధికారులు ఉన్నారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, వివిధ శాఖల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...