రైతుకు మద్దతు


Tue,May 21, 2019 12:26 AM

-జిల్లా పరిధిలో 3604 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేసిన రైతులు
-కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల వసతులు కల్పించిన అధికారులు
తాండూరు, నమస్తే తెలంగాణ: వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో రైతులు మద్దతు ధరలు పొందేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దళారులకు రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించి ఆర్థికంగా నష్టాలపాలవకూడదన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కేంద్రంతో కొట్లాడి అదనంగా ఏర్పాటు చేయిస్తోంది. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పండించే అన్ని రకాల వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్న నేఫథ్యంలో రైతులకు అన్ని రకాల పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా యాసంగికి వరి( ధాన్యం) కోతలు మొదలు కావడంతో జిల్లా పరిధిలో 27 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఐకేపీ( ఇందిరా క్రాంతి పథకం -డ్వాక్రా) ద్వారా 11, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో (డీసీఎంఎస్‌)ద్వారా 14, పీఏసీఎస్‌ల( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల) ద్వారా రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 15 నుంచి జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

తాండూరు నియోజకవర్గంలోని తాండూరుతో పాటు యాలాల మండలం లక్ష్మినారాయణపూర్‌, జుంటుపల్లి, తిమ్మాయిపల్లి, యాలాలలో.., పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌, బషీరాబాద్‌.., వికారాబాద్‌ నియోజకవర్గంలోని ధారూరు, నాగారం.., కొడంగల్‌ నియోజకవర్గంలోని కొడంగల్‌, హస్నాబాద్‌, నర్సాపూర్‌, దౌల్తాబాద్‌లో రెండు, నాగిరెడ్డిపల్లి, బాలంపేట్‌, నందారం, పెద్ద నందారం, బొంరాస్‌పేట్‌, ఏర్పుమాళ్ల, మెట్లకుంటలలో.., పరిగి నియోజకవర్గం పరిగి, దోమ, కుల్కచర్లలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయించారు. గత ఏడాదికన్నా ఈ సారి ఒక కొనుగోలు కేంద్రం అదనంగా ఏర్పాటు చేయడం గమనార్హం.

దీంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుత యాసంగిలో 3604 హెక్టార్ల విస్తీర్ణంలో రైతు లు వరి పంట సాగు చేశారు. గత యాసంగిలో 4032 హెక్టార్లలో రైతులు వరి( ధాన్యం) పండించారు. అంటే గత ఏడాది కన్నా 430 హెక్టార్ల విస్తీర్ణం ధాన్యం సాగు తగ్గింది. జిల్లాలో బోరు బావుల్లో భూగర్భ జలాలు తగ్గడంతో ధాన్యం సాగు తగ్గింది. కాగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో నుంచి దాదాపు ఒక లక్షా 80 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువస్తారని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులు అంచనాలు వేశారు. కాగా ఇప్పటికే 31630 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. యాసంగి పంటగా వస్తున్న ధాన్నాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకుని లాభాలు పొందాలని ప్రభుత్వం కోతల సమయంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల కు అం దుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకురావడం గమనార్హం. దీంతో మార్కెట్‌లో లభిస్తున్న ధరలకన్నా రూ.150 నుంచి 200 అధికంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు లభిస్తున్నాయి. ఏ గ్రేడ్‌ ధాన్యానికి రి ఏగ్రేడ్‌ రకానికి ( దొడ్డు రకం 617, ఫాల్గుణ, ఎంటీయూ-1010 రకాలకు) క్వింటాలుకు 1770 చెల్లించాలని నిర్ణయించారు.

గత ఏడాది రూ. 1590 చెల్లించారు. దీంతో గత ఏడాదికన్నా ఈసారి క్వింటాలుకు రూ. 180 అధికంగా చెల్లించనున్నారు. అలాగే కామన్‌ రకానికి (ఎంటీయూ-1001) ఈ ఏడాది 1750 చెల్లించేందుకు నిర్ణయమైంది. గత ఏడాది కామన్‌ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 1470 చెల్లించగా ఈసారి క్వింటాలుకు రూ. 280 వరకు అధికంగా చెల్లిస్తున్నారు. ఈ నెల 15 నుంచి జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లో ప్రారంభమైన 27 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జూన్‌ నెలాఖరు వరకు అన్ని కేంద్రాల ఏర్పాటు పూర్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు.

కాగా జిల్లాలో ఏర్పాటు చేసే 27 కొనుగోలు కేంద్రాల పరిధిలో రైతులు తమ పంట ఉత్పత్తులు విక్రయించుకునేందుకు తూకం వేసేందుకు సమయం పట్టనుండడంతో అంతవరకు రైతులకు తాగు నీరు, నీడ కల్పించేందుకు టెంట్లు వంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కూడా తూకాల సంఖ్యను కూడా పెంచేందుకు నిర్ణయించారు. తేమ అధికంగా ఉన్న రైతులు తాము కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చిన ధాన్యాన్ని అరబెట్టేందుకు కూడా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...