కొనసాగుతున్న పంట సర్వే పత్రాల స్వీకరణ


Tue,May 21, 2019 12:19 AM

పెద్దేముల్‌ : మండల పరిధిలోని వివిధ క్లస్టర్‌లలో ఆయా గ్రామాల రైతుల నుంచి పంట సర్వే (రైతు సమగ్ర సమాచార సేకరణ) పత్రాలను సోమవారం వ్యవసాయ అధికారులు స్వీకరించారు. పెద్దేముల్‌ మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతుల నుంచి క్లస్టర్‌ల వారీగా పంట సర్వే పత్రాలను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి రోజు వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లి స్వీకరిస్తున్నారు. కాగా మండల పరిధిలోని పెద్దేముల్‌, మంబాపూర్‌ క్లస్టర్‌లలో ఏఈవో బాలు, గోపాల్‌పూర్‌ క్లస్టర్‌లో ఏఈవో ఎండీ. వసీమ్‌, కందనెల్లి క్లస్టర్‌లో ఏఈవో స్వాతి , ఆయా క్లస్టర్‌ల పరిధిలోని రైతుల నుంచి పంట సర్వే పత్రాలను స్వీకరిస్తున్నారు. కాగా రైతుల పంట సర్వే పత్రాల స్వీకరణ కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి నజీరొద్దీన్‌ షేక్‌ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సోమవారం మండల ఏఈవో బాలు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ పెద్దేముల్‌ మండల పరిధిలో మొత్తం సుమారు 10,800 రైతుల ఖాతాలు ఉన్నాయని, క్లస్టర్‌ల వారీగా ఆయా గ్రామాల రైతుల నుంచి ఇప్పటి వరకు సుమారు 7,600 మంది రైతులు తమ పంట సర్వే వివరాలని అందించారని,అందులో సుమారు 3,800 మంది రైతుల పంట సర్వే వివరాలను ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘రైతు బంధు’ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేశామని మిగతా వాటిని కూడా గ్రామాల వారీగా వేరు చేసి త్వరలోనే వాటిని కూడా వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేస్తామని ఏఈవో బాలు తెలిపారు. ఇంకా ఎవరైన రైతు తమ పంట సర్వే పత్రాలను సమర్పించక పోతే వారు పంట సర్వే పత్రాలతో పాటు రైతు పట్టాపాసుపుస్తకం, ఆధార్‌ కార్డు, రైతు బ్యాంక్‌ పాసుపుస్తకం జిరాక్స్‌ కాపీలను జతపరిచి వ్యవసాయాధికారులకు అందించాలని ఆయన కోరారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...