భూసార పరీక్షలతో ఎంతో లాభం


Tue,May 21, 2019 12:19 AM

మోమిన్‌పేట : రైతులు పండిస్తున్న పంటలకు అధిక దిగుబడి సాధించేందుకు మండలంలో వ్యవసాయాధికారు లు పైలట్‌ ప్రాజెక్టు కింద మండల పరిధిలోని రామ్‌నాత్‌గుడుపల్లి, మల్లారెడ్డిగూడ గ్రామాల్లో భూ సార పరీక్షలు చేపట్టారు. ఈ రెండు గ్రామాల్లో కలిసి 33 5 మంది రైతుల నుంచి పొలాల్లో మట్టిని సేకరించి ల్యాబ్‌కు తరలించారు. ఈ నెల 30వ తేదీలోగా రైతుల పొలాలకు సంబంధించిన మట్టి నమూనాల ఫలితాలు అందించడం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి తెలిపారు. భూ మిలోని పోషకాలు నత్రజని, భాస్వరం ఎంత మోతాదులో ఉంది, ఆ భూమిలో ఏ పంట వే యాలనేది ముందుగానే తెలుస్తున్నది. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో రైతులు పంటలు పండిస్తే మంచి దిగుబడి, లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ రెండు గ్రామాల రైతులు వ్యవసాయాధికారులకు సహకరిస్తూ ఖరీఫ్‌ సీజన్‌కు సిద్ధం చేసుకున్న పొలాల నుంచి మట్టిని అందించారు. గ్రా మాల్లో 80 శాతం మంది రైతులు పత్తి పంట వేసేందుకు మొగ్గు చూ పుతుండగా మిగతా వారు మొక్కజొన్న, కంది పంటలు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇతర పంటలు వేసేందుకు అవకాశం ఉ న్న అడవి పందుల బెడద విపరీతంగా ఉండడంతో పత్తి పంట త ప్ప ఇతర ఏ పంటలు వేసేందుకు రైతులు అంతగా ఆసక్తి కనబర్చ డం లేదని వ్యవసాయశాఖ ఏఈవోలు తెలిపారు. పందుల గొడవ లేకుండా చూస్తే పెసర, మినుము లు, బెబ్బర్లు, నువ్వులు ఇతర పంటలు వేసేందుకు అవకాశం ఉంటుందని గ్రామాల రైతు లు తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారం భం కాగానే పొలాల్లో పంటలు వేసే సమయంలో ఎంత ఎంత మోతాదులో ఎరువు మందులు వాడాలి అనేది రైతులకు అవగాహన కల్పిస్తామని వ్యవసాయాధికారులు తెలిపినట్లు గ్రామాల రైతు లు తెలిపారు. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పొలాలను దు న్నడం, రొప్పడం జరిగిందని తొలకరి ప్రారంభం కాగానే వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకొని పంటలు వేసేందుకు రైతులు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...