ఉపాధిలో ఊట కుంటలు నిర్మించాలి


Mon,May 20, 2019 03:46 AM

-20 నుంచి 29 వరకు ఊట కుంటల నిర్మాణాలు
-పారమ్ ఫండ్‌ల నిర్మాణాలు రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం
-డీఆర్‌డీవో జాన్సన్
వికారాబాద్, నమస్తే తెలంగాణ : ఉపాధి హామీలో నీటి ఊట కుంటల నిర్మాణ పనులను పెద్ద ఎత్తున బ్యాచ్‌లకు విభజించి ఈ నెల 20 నుంచి 29 వరకు పారమ్‌ఫండ్ నిర్మాణాలు చేపడుతామని డీఆర్‌డీవో జాన్సన్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి 25 వరకు మొదటి బ్యాచ్, 23 నుంచి 29 వరకు రెండో బ్యాచ్‌ను ఏర్పాటు చేసి పారమ్‌ఫండ్‌ల వారోత్సవంగా ఏర్పాటు చేసి శ్రమ శక్తి సంఘాల ద్వారా అన్ని గ్రామాల్లో పారమ్‌ఫండ్‌ల నిర్మాణాలు భారీ ఎత్తున చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 2016-17 సంవత్సరం లో 2,277, 2017-18లో 4,111 అదే విధంగా, 2018-19లో 1,758, ఊటకుంటల నిర్మాణాలు చేపట్టి వరుసగా మూడు సంవత్సరాలు రాష్ట్రంలో పారమ్‌ఫండ్ల నిర్మాణాల్లో ప్రథమ స్థానం సాధించడం జరిగిందన్నారు. అదే విధంగా ఇప్పటికి వికారాబాద్‌లో చాలా నీటి బావులు, గొట్టపు బావులు ఎండిపోవడం జరిగిందని తెలిపారు. అడుగంటిన భూ గర్బజలాలను మళ్లి పెంపొందించుకోవాలంటే 2019-20 సంవత్సరంలో పెద్ద ఎత్తున ఊట కుంటల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగడం జరుగుతుందని తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...