ఎస్‌బీఎం నోడల్ అధికారులు వీరే


Mon,May 20, 2019 03:46 AM

కులకచర్ల: మండలంలో మరుగుదొడ్ల నిర్మాణాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామాల వారీగా మండల స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. ఒక్కొక్క నోడల్ అధికారికి రెండు గ్రామాల చొప్పున కేటాయించి గ్రామాల్లో జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేసి జూన్ 2వరకు మండలాన్ని ఓడీఎఫ్ గా చేసేందుకు మండల స్థాయి అధికారులను నియమించారు. వీరిలో సయ్యద్ తారిక్ అన్వర్ ఎంపీడీవో బండవెల్కిచర్ల, బొంరెడ్డిపల్లి, సురేశ్‌బాబు ఈవోపీఆర్డీ అంతారం, పుట్టపహాడ్, ఇంద్రసేనా ఎంపీడీవో సూపరింటెండెంట్‌కు ముజాహిద్‌పూర్, రాంరెడ్డిపల్లి, మల్లికార్జున్ ఏపీవోకు కుస్మసముద్రం, రాంపూర్, చంద్రశేఖర్ ఈసీకి కులకచర్ల, కామునిపల్లి, వెంకటయ్య ఎంపీడీవో జూనియర్ అసీస్టెంట్‌కు ఘనాపూర్, సాల్వీడ్, రవి ఎంపీడీవో సీనియర్ అసీస్టెంట్‌కు అడవివెంకటాపూర్, లింగంపల్లి, మణికుమార్ ఏఈకి చౌడాపూర్, మందిపాల్, శోభ ఏపీఎంకు తిర్మలాపూర్, ఇప్పాయిపల్లి, జగదీశ్వరీ ఎంపీడీవో కార్యాలయ టైపిస్ట్‌కు ఎత్తుకాల్వ తండా, చాపలగూడెం, నరేశ్ టీఏకు చెరువుముందలితండా(ఎ), బిందెంగడ్డతండా, వీరబాబు టీఏకు లాల్‌సింగ్‌తండా, బండమీదితండా, నర్సింలు టీఏకు చెరువుముందలితండా, గోరిగడ్డతండా, భగవంత్‌కుమార్ టీఏ గోగ్యనాయక్‌తండా, బొర్రహేమ్యతండా, బజ్యనాయక్‌తండా, నాగేంద్రప్ప టీఏకు ఈర్లవాగుతండా, విఠలాపూర్, గోపాల్ టీఏకు వాల్యనాయక్‌తండా, దాస్యనాయక్‌తండా, డాక్యనాయక్ టీఏకు అల్లాపూర్, పటెల్‌చెరువుతండా గ్రామాలను కేటాయించారు. వీరి ప్రతి రోజు తమ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో పూర్తి అయ్యాయో ఎంపీడీవో కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ఎంపీడీవో తారిక్ అన్వర్ తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...