హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలి


Sat,May 18, 2019 11:34 PM

-జూన్‌ రెండో వారంలో మొక్కలు నాటాలి
-చింత మొక్కలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
-కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : హరితహారం లో జూన్‌ రెండో వారంలో మొక్కలు నాటేందుకు గ్రామ నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా అధికారులను అదేశించారు. శనివారం వికారాబాద్‌ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏపీవోలు, ఈసీలతో హరితహారం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నర్సరీల్లో విత్తన మొక్కలు మొ లకెత్తని స్థానంలో ఉంటే వెంటనే కొత్త విత్తనాలు నాటి లక్ష్యానికి అవసరమైన మొక్కలను పెంచాలని తెలిపారు. మొక్కల పెంపకానికి అన్ని గ్రామ పంచాయతీల్లో డీఆర్‌డీఏ శాఖకు 1.94 కోట్ల మొ క్కలు నాటేందుకు లక్ష్యం నిర్ణయించడం జరిగిందన్నారు. లక్ష్యానికి అనుగుణంగా నర్సరీల్లో చిం త, కానుగ, వేప, మునగ, నేరేడు, గోరింట గులా బీ లాంటి మొక్కలను పెంచాలన్నారు. చింత మొ క్కలపై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతి 100 మొక్కల్లో 5 చింత మొక్కలు ఉండే విధంగా నర్సరీల్లో మొక్క లు పెంచి సిద్ధం చేయాలన్నారు. ప్రతి గ్రామ పం చాయతీల్లో సర్పంచ్‌లను భాగస్వాములను చేసి మొక్కల పంపిణీ, ఎక్కడ నాటాలని స్థల సేకరణపై వారితో సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానా లు చేయాలని అదేశించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సా యంతో హరితహారంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి మొక్కలు సిద్ధం చేసి కార్యక్రమం వి జయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు.
నీటి కొరత వల్ల కొన్ని నర్సరీల్లో మొక్కలు ఎ దుగడం లేనందున, నీరు ఉన్న నర్సరీల్లో మొక్క లు పెంచి లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్‌ అ ధికారులకు తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీవో జాన్సన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...