భూగర్భ జలాలు పెంచుకుందాం


Sat,May 18, 2019 11:13 PM

-ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత అవసరం
-జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌

హిమాయత్‌నగర్‌ : నగరంలో భూగర్భ జలవనరులను పెంచేందుకు ప్రతి ఇంటిలో ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ పిలుపునిచ్చారు. ఇంకుడు గుంతల నిర్వహణ(వాటర్‌ హార్వేస్టింగ్‌) దినోత్సవంలో భా గంగా శనివారం నారాయణగూడలోని మేల్కోటే పార్కు, కింగ్‌కోఠి వైద్యశాల ఆవరణంలో ఉన్న ఇం కుడు గుంతల పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది. దానకిశోర్‌ హాజరై మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, భవిష్యత్‌తరాలకు నీటి కొరత లేకుం డా ప్రతి ఇంటిలో ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలన్నారు. చెత్తాచెదారంతో నిండి ఉన్న ఇంకుడుగుంతలను శుభ్రం చేయడం వల్ల వర్ష్షాకాలంలో వాన నీరు భూమిలోనికి చేరుతుందని, జీహెచ్‌ఎం సీ, జలమండలి నిర్మించిన ఇంకుడు గుంతలే కాకు ండా ఇండ్లు, అపార్ట్‌మెంట్లలో ఏర్పాటు చేసిన ఇం కుడు గుంతలను స్వచ్ఛందంగా పునరుద్ధరించుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ జె. హేమలతయాదవ్‌, నారాయణగూడ జలమండలి జీఎం దామోదర్‌రెడ్డి, డీజీఎం పీవీ రమణారెడ్డి, మేనేజర్‌ రమేశ్‌, జీహెచ్‌ఎంసీ డీసీ కృష్ణయ్య, ఏఎంహెచ్‌వో డాక్టర్‌ హేమలత, కో ఆర్డినేటర్‌ నవీన్‌, మేల్కోటే పార్కు అధ్యక్షుడు భూషణ్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు జె.బాబుయాదవ్‌, డి.రాజేందర్‌కుమార్‌, శ్రీనాథ్‌రావు, జీహెచ్‌ఎంసీ ఈఈ నామ్య నాయక్‌, డీఈ సుధాకర్‌, ఏఈ ఫరీద్‌, కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్స్‌ వరలక్ష్మి, యాస్మిన్‌, అఖిల,అమరావతి,మార్పు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీశైలం పాల్గొన్నారు.

‘ప్రతి ఒక్కరూ సహకరించాలి’
మల్కాజిగిరి: ప్లాస్టిక్‌ వాడకాన్ని నిరోధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జీహెచ్‌ంఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ కోరారు. మల్కాజిగిరిలో శనివారం నిర్వహించిన ‘షాన్‌ హైదరాబాద్‌- షాన్‌దార్‌ హైదరాబాద్‌' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి స్వచ్ఛ ఆటో టిప్పర్లకు అందజేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఓపెన్‌నాలాలో చెత్తను వేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు కాలనీవాసులు ముందుకు రావాలన్నారు. అనంతరం ప్లాస్టిక్‌ తొలగింపు, ఇంకుడు గుంతలకు మరమ్మతు పనుల్లో దానకిశోర్‌ పాల్గొన్నారు. కమిషనర్‌తో పాటు జోనల్‌ కమిషనర్‌ రఘుప్రసాద్‌, ఉపకమిషనర్‌ వేణుగోపాల్‌, మిస్‌ ఆసియా ఫసిఫిక్‌ మమతాదేవీ, కథక్‌ నృత్యా కళాకారిణి శిల్పా చక్రవర్తి పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...