ఘనంగా తిరుమలనాథస్వామి కల్యాణోత్సవం


Sat,May 18, 2019 11:12 PM

పూడూరు : దేవాలయలను సందర్శించడం, కల్యాణోత్సవాలల్లో పాల్గొనడం వంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి మనశాంతి కలుగుతుందని శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌ జె.నర్సింహులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ తిరుమలనాథస్వామి కల్యాణోత్సవం దేవాలయ కమిటీ చైర్మన్‌ కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు. ఉదయం నుంచి దేవాలయంకు పలు ప్రాంతాల భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన కల్యాణోత్సవం కనులపండుగగా జరిగింది. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు దేవాలయ కమిటీ చైర్మన్‌ జె.నర్సింహులు, అర్ఛకులు భీమాచార్యులు తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే రాత్రి 10 గంటలకు రథోత్సవము కార్యక్రమం చెపట్టారు. నేడు ఆదివారం రాత్రి 10 గంటలకు దోపోత్సవము, 20వ తేదీన ఉదయం 8:30 గంటలకు సహస్ర పుష్పర్ఛన, 21వ తేదీన ఉదయం 10:30 గంటలకు చక్రతీర్థము కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. కల్యాణోత్సవ కార్యక్రమంలో సర్పంచ్‌ కమ్లీబాయి, మాజీ సర్పంచ్‌లు పెంటయ్య, జె.శ్రీనివాస్‌, జంగయ్య, సాయన్న, యువకులు తదితరులు ఉన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...